బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron Virus : బెంగళూరులో ఓమిక్రాన్ కలకలం-ఓ వ్యక్తి నుంచి ఐదుగురికి సోకిన వైరస్

|
Google Oneindia TeluguNews

భారత్ లో ఓమిక్రాన్ వైరస్ కలకలం మొదలైంది. ఇవాళ కర్నాటకలోని బెంగళూరులో కోవిడ్ క్వారంటైన్ తీసుకుంటున్న ఇద్దరికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరిలో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు కాగా.. మరో వ్యక్తిని బెంగళూరు వాసిగా గుర్తించారు. ఈ బెంగళూరు వాసి నుంచి మరో ఐదుగురికి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి.

బెంగళూరులో ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు గుర్తించిన వారిలో ఒకరి నుంచి మరో ఐదుగురు ప్రాథమిక కాంటాక్ట్ లకు కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ ఐదుగురూ ఇవాళ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో వీరికి కూడా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. అసలే ఓమిక్రాన్ వైరస్ గతంలో వచ్చిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని డబ్లూహెచ్ వో హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో బెంగళూరులో ఒక్కసారిగా కలకలం రేగుతోంది.

Five other tested covid 19 positive with Omicron-infected patient in Karnataka

Recommended Video

Omicron Variant : Omicron Enters In India || Oneindia Telugu

బెంగళూరులో బయటపడిన ఓమిక్రాన్ రోగి యొక్క ఐదుగురు కాంటాక్ట్ లు కోవిడ్ పాజిటివ్‌గా మారాయని, రాష్ట్రంలో కొత్త కోవిడ్ వేరియంట్ యొక్క తొలి కేసులు బయటపడినట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ బయటపడిన ఓమిక్రాన్ వైరస్ రోగులను ఒంటరిగా ఉంచామని, వారి శాంపిల్స్ ను జన్యు పరీక్షల కోసం పంపినట్లు ప్రభుత్వం తెలిపింది. కర్నాటకలో రెండు కేసులు బయటపడినట్లు కేంద్రం ప్రకటించిన కొన్నిగంటల్లోనే కర్నాటక ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం విశేషం.

ఇవాళ బయటపడిన రెండు ఓమిక్రాన్ కేసుల్లో ఒకరు బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల రెండు డోసుల టీకాలు తీసుకున్న డాక్టర్. అతను నవంబర్ 21 న జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. మరుసటి రోజు పాజిటివ్ గా తేలాడు. అతని నమూనా అదే రోజు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. మూడు రోజుల తర్వాత అతను డిశ్చార్జి అయ్యాడు. విస్తృతమైన కాంటాక్ట్ ట్రేసింగ్ తర్వాత, కర్ణాటక ప్రభుత్వం అతనికి 13 డైరెక్ట్ కాంటాక్ట్ లు 250 కంటే ఎక్కువ ద్వితీయ కాంటాక్ట్ లు ఉన్నాయని తెలిపింది. మరొక ధృవీకరించబడిన ఓమిక్రాన్ రోగి 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడిగా తేల్చారు. అతను నెగెటివ్ కోవిడ్ రిపోర్ట్ తో భారతదేశానికి వచ్చాడు.

English summary
five others affected to omicron virus from bengaluru patient today, as per the latest reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X