రూ.175 కోట్ల విలువ గల 35 కిలోల డ్రగ్స్ సీజ్, తీరం గుండా దేశంలోకి రవాణా, గస్తీ కాసి పట్టుకున్న ఏటీఎస్
తీరం గుండా భారతదేశంలోకి భారీగా డ్రగ్స్ తరలిచేందుకు పాకిస్థాన్‌కు చెందిన కొందరు ప్రయత్నించారు. పక్కా సమాచారంతో గుజరాత్ తీరం వద్ద పాకిస్థాన్‌కి చెందిన బోటును ఆంటీ టెర్రరిజం స్కాడ్, గుజరాత్ పోలీసులు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా పట్టుకున్నారు. భారత జలాల్లోకి బోటు ప్రవేశించిన తర్వాత ముట్టడించి, బోటును స్వాధీనం చేసుకున్నారు.

35 కిలోల డ్రగ్స్
బోటులో తనిఖీ చేపట్టగా భారీగా మత్తు పదార్థాలు కనిపించాయి. ఇందులో నార్కొటిక్ డ్రగ్స్, హెరాయిన్ ఉన్నాయి. బోటులో ఉన్న అనీస్ ఐసా భట్టి (30), ఇస్మాయిల్ మహమద్ కచ్చీ (50), ఆస్రఫ్ ఉస్మాన్ కచ్చీ (42), కరీమ్ అబ్దులా కచ్చీ (37), అబుబకార్ అస్రఫ్ సుమ్రా (55)ను డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 35 కిలోల డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.175 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

సమాచారంతో
పాకిస్తాన్ నుంచి కొందరు అక్రమంగా డ్రగ్స్ తీసుకొస్తున్నారని ఏటీఎస్‌కు సమాచారం వచ్చింది. దీంతో కోస్ట్ గార్డు, పోలీసులతో సమన్వయం చేసుకొని తీరం వెంబడి గస్తీ కాశారు. కచ్ వద్దగల జకౌవ్ వద్ద నిరిక్షీంచారు. వాయవ్య దిశగా జకౌవ్‌కు పాకిస్తాన్‌కు చెందిన జామ్ జామ్ బోటు వచ్చింది. భారత జలాల్లోకి బోటు రావడంతో ఐబీఎస్, మెరైన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బోటును ముట్టడించి ప్రణాళిక ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.

విచారణ
బోటును పరిశీలించగా అందులో భారీగా మత్తు పదార్థాలు ఉన్నాయి. 35 కిలోల డ్రగ్స్‌ను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. కోట్లలో ఉంటుందని చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు పాకిస్తానీలను విచారిస్తున్నారు. డ్రగ్స్ ఇప్పుడేనా..? గతంలో ఏమైనా తీసుకొచ్చారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications