ఎలాంటి గొడవ, ఊర్లో ఎదురు కాల్పులు. ఐదు మంది ప్రాణాలు పోయాయి, హోమ్ మంత్రి !
భోపాల్/మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో బుధవారం రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పశువులను మేపుతున్నందుకు ఓ వర్గం అభ్యంతరం చెయ్యడంతో అక్కడ గొడవ జరిగింది. తరువాత రెండు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. దీంతో ఐదుగురు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి నరోత్తమ్ మిశ్రా సొంత నియోజకవర్గమైన రెండా గ్రామంలో బుధవారం డాంగి, పల్ అనే రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి. ప్రాథమిక దర్యాప్తును ప్రస్తావిస్తూ దాతియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ శర్మ మాట్లాడుతూ ప్రకాష్ డాంగి మరియు ప్రీతమ్ పాల్ మధ్య మూడు రోజుల క్రితం పెంపుడు జంతువులను మేపడంపై వాగ్వాదం జరిగింది.

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రదీప్ శర్మ తెలిపారు. ఎదురుకాల్పుల్లో ప్రకాష్ దుంగి, రామ్ నరేష్ దుంగి, సురేంద్ర దుంగి, రాజేంద్ర పాల్, రాఘవేంద్ర పాల్ మరణించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మృతులంతా 30 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు అంటున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనా స్థలంలో పోలీసులు మకాం వేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మధ్యప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు..












Click it and Unblock the Notifications