• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారీ వర్షాలు..వరదలు ఉత్తరాదిలో: 145మంది మృత్యువాత: 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులు..!

|
  Bihar Flooded After Heavy Rain || భారీవర్షాలకు దేశవ్యాప్తంగా 145 మంది మృతి

  కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు పొంగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వరదలు లక్షలాది మందిని నిరాశ్రయులను చేసాయి. వారణాశితో సహా అనేక ఉత్తరాది ప్రాంతాల్లో వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. గత వందేళ్లలో లేని విధంగా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్...బీహార్ తో పాటుగా మహారాష్ట్రలోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ప్రభావం యూపీలో ఖైదీల మీద పడింది. 900 మంది ఖైదీలను సమీప జైళ్లకు తరలించారు. ఇప్పటి వరకు అత్యధికంగా యూపీలో 111 మంది, బిహార్‌లో 27 మంది సహా దేశవ్యాప్తంగా 145 మంది మృత్యువాత పడ్డా రు. కాగా 20 లక్షల మంది వరకు నిరాశ్రయులయ్యారు.

  25 ఏళ్ల కాలంలో అత్యధిక వర్షపాతం..

  25 ఏళ్ల కాలంలో అత్యధిక వర్షపాతం..

  మహారాష్ట్రలో 25 ఏళ్ల కాలంలనే అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 10 శాతం ఎక్కువగా నమోదు కావటంతో ముంబాయిలోని సాధారణ ప్రజానీకం మీద ప్రభావం ఎక్కువగా పడింది. ఇక ఉత్తరాది ప్రాంతాల్లో ఉత్తరాది వరద నీరు ముంచెత్తింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రెండు దశాబ్దాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో యూపీలో 111 మంది, బిహార్‌లో 27 మంది సహా దేశవ్యాప్తంగా 145 మంది మృత్యువాత పడ్డా రు. బిహార్‌లో 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

  బిహార్‌ డిప్యూటీ సీఎం సుశీ ల్‌ మోదీ ఇంట్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. యూపీలో గంగా నదికి సమీపం లోని బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో 900 మంది ఖైదీలను సమీప జైళ్లకు తరలించారు. గయా జిల్లాలోని ఓ గ్రామంలో గోడ కూలి ఐదుగురు చనిపోయారు. బిహా ర్‌లో వరద బాధితులకు సాయం చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలను రాహుల్‌గాంధీ కోరారు.

  20 లక్షల మందికి పైనా నిరాశ్రయులు

  20 లక్షల మందికి పైనా నిరాశ్రయులు

  ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కలిపి 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బిహార్‌ రాజధాని పట్నాలో కుండపోత వానలతో డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ అధికార నివాసం సోమవారం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆయనతోపాటు కుటుంబసభ్యులను పోలీసులు రబ్బర్‌బోట్‌లో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

  పట్నాలోని చాలా ప్రాంతాలు మూడు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. వానల తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం అధికారుల సెలవులు రద్దు చేసింది. పాట్నాలోని వరద ప్రభావిత ప్రాంతాల నుంది దాదాపు నాలుగు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. అధికారిక అంచనాల ప్రకారం ఈ వరదల ధాటికి దాదాపు 20 లక్షల మందికి పైనా నిరాశ్రయులు అయినట్లుగా గుర్తించారు. వర్షాలు తగ్గుముకం పట్టే వరకూ వారిని పునరావాస శిబిరాల్లోనే ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

  ప్రధాని హామీ.. రాహుల్ పిలుపు

  ప్రధాని హామీ.. రాహుల్ పిలుపు

  భారీ వరదల కారణంగా బీహార్ లో జరిగిన నష్టం పైన ప్రధాని మోదీ ఆరా తీసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ తో దీని పైన చర్చించారు. తక్షణ సహాయ చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని సహాయ చర్యల్లో అధికారులు నిమగ్నం అయి ఉండటంతో ఇప్పుడే నష్టం పైన అంచనాకు రాలేమని సీఎం నితీశ్ స్పష్టం చేసారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

  అదే విధంగా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బిహా ర్‌లో వరద బాధితులకు సాయం చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలను రాహుల్‌గాంధీ కోరారు. బీహార్.. ఉత్తరప్రదేశ్.. గుజరాత్ .. జార్ఖండ్..వంటి ప్రాంతాల్లోని పరిస్థితి గురించి కేంద్రం ఆరా తీసింది. కేంద్రం నుండి ఇటువంటి పరిస్థితుల్లో మద్దతు లభిస్తోందని హామీ ఇచ్చారు.

  English summary
  heavy rais and floods effected across parts of India, Bihar and Uttar Pradesh have been reeling under floods since the past few days, with the death toll mounting to 148 in the country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X