కోపార్ది గ్యాంగ్ రేప్, హత్య కేసులో ముగ్గురికి మరణశిక్ష
ముంబై: కోపార్ది గ్యాంగ్‌రేప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు కూడా అహ్మద్‌నగర్ జిల్లా సెషన్సు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా నిరుడు ఈ సంఘటన సంచలనం సృష్టించింది. కోపార్ది గ్యాంగ్‌రేప్, హత్య కేసులో జితేంద్ర బాబూలాల్ షిండే, సంతోష్ గోర్కా బవాల్, నితిన్ గోపీనాథ్ భలూమే నిందితులుగా ఉన్నారు.
ఈ కేసు విచారణకు 2016 డిసెంబర్ 20న స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర్లలోని అహ్మద్ నగర్ జిల్లా కోపార్దీలో 2016 జులై 13న 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుండుగులు సామూహిక అత్యాచారం జరిపి, ఆపై ఆమెను హత్య చేశారు.

రక్తమోడుతున్న బాలిక మృతదేహాన్ని గ్రామానికి దగ్గర్లోని ఒక చెట్టు దగ్గర ప్రజలు గుర్తించారు. బాధిత బాలిక మారాఠా వర్గానికి చెందినది. కేసు తీర్పు వెలువడిన తర్వాత నిందితుల తరపు న్యాయవాది బాలాసాహెబ్ ఖోప్డే - నేరం చేసినా ఇంతటి తీవ్రమైన శిక్ష విధించడం సమంజసం కాదని ఆయన కోర్టుకు తెలిపారు.
ప్రాసిక్యూషన్ తరఫున కేసు వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ మాత్రం తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అత్యంత అరుదైన కేసుల్లో ఒకటని, నిందితులకు ఉరి శిక్షే సరైందని అన్నారు.












Click it and Unblock the Notifications