1978 తర్వాత తొలిసారిగా.. జులై14న తెర‌చుకోనున్న జగన్నాథుని రత్న భాండాగారం..

ఒడిశాలోని పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయంలో ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. గ‌త కొన్నిరోజులుగా ఈ ఆల‌యం పేరు వార్త‌ల్లో నిలిచింది. పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో అనేక అప‌శ్రుతులు చోటుచేసుకున్నాయి. చాలామంది భ‌క్తులు గాయాల‌పాల‌యిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, మ‌రోసారి ఈ జగ‌న్నాథుని ఆల‌యం వార్త‌ల్లొకెక్కింది. పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని జులై 14వ తేదిన తెరవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ఈ భాండాగారం ఎంతో ర‌హ‌స్య‌మైన గ‌ది. ఇందులో అనేక అమూల్య‌మైన అభ‌ర‌ణాలున్నాయ‌ని స‌మాచారం. ఈ భాండాగారంలోని ఐదు పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించేందుకే ఈ నెల 14న దీనిని తెర‌వ‌బోతున్నారు. ఆ సమయంలో అనుసరించవలసిన మార్గదర్శకాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

For the first time after 1978 Jagannath s Ratna Bhandagaram will be opened on July 14

1978 తర్వాత తొలిసారిగా ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు. అయితే, చాలా సంద‌ర్భాల్లో ఈ రత్న‌భాండాగారాన్ని తెరిచేందుకు ప్ర‌య‌త్నించినా పాముల భ‌యంతో చాలామంది లోప‌ల‌కి వెళ్ల‌లేపోయారు. అయితే పురాతన దేవాలయాల్లోని ఖజానాలకు పాములు కాపలా ఉంటాయనే న‌మ్మ‌కం ఇంకా నెల‌కొని ఉండ‌డంతో ఇందులో వెళ్లేందుకు చాలామంది భ‌య‌ప‌డుతున్నారు.

గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ ర‌త్నాభాండాగారంలో ఉన్నాయ‌ని చాలామంది భావిస్తున్నారు. వీటి ధ‌ర వెల‌క‌ట్ట‌లేద‌ని కూడా చాలామంది అంచ‌నా వేస్తున్నారు.

For the first time after 1978 Jagannath s Ratna Bhandagaram will be opened on July 14

అటువంటి అత్యంత విలువైన ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్త‌డంతో ఈ ర‌త్నాభాండ‌గారాన్ని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, గ‌తంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4వ తేదిన నిపుణుల బృందం వెళ్లింది. ఆ రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్ల‌లేక నిపుణుల బృందం వెనుదిరిగింది. ఇక‌, సారి అధికారులు అన్నీ ప్ర‌ణాళిక‌ల‌తో ఈ ర‌హ్య‌స‌గ‌దిని తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+