కేజ్రీవాల్‌పై ఢిల్లీలో బిజెపి అభ్యర్థిగా సజియా ఇల్మీ?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నాయకురాలు సజిలా ఇల్మీ గురువారంనాడు బిజెపిలో చేరే అవకాశం ఉంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌పై బిజెపి అభ్యర్థిగా ఆమె పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు బుధవారం వార్తలు వచ్చాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో వారిద్దరి మధ్య పోటీ జరిగవచ్చు.
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపిస్తూ నిరుడు ఇల్మీ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. స్వరాజ్ గురించి మాట్లాడుతున్న పార్టీ తన విషయంలో మాత్రం దాన్ని పాటించడం లేదని ఆమె విమర్శించారు. 2013 ఢిల్లీ ఎన్నికల్లో ఇల్మీ ఓటమి పాలయ్యారు.

బిజెపి అభ్యర్థి అనిల్ శర్మ చేతిలో ఆమె కేవలం 326 ఓట్ల తేడాతో ఆర్‌కె పురం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఘజియాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్ చేతిలో ఓడిపోయారు. ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు.
2013 ఎన్నికల్లో బిజెపికి 31 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు, కాంగ్రెసుకు 8 సీట్లు వచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 శాసనసభా స్థానాలున్నాయి. మొత్తం 1.3 కోట్ల ఓటర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications