బీజేపీకి ప్రచారం చేశాక గంటలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ..!
హర్యానా ఎన్నికల ప్రచారానికి తెరపడే ముందు రాష్ట్రంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఛీఫ్ సహా కీలక పదవుల్లో పనిచేసి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిపోయిన ఓ మాజీ ఎంపీ.. ఇవాళ అనూహ్య పరిమాణాల మధ్య తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడి ఓటర్లు, రాజకీయ వర్గాల వంతయింది. ఇంతకీ ఆ మాజీ ఎంపీ ఎందుకు ఇలా చేశారో ఓసారి చూద్దాం.
హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కానీ ఎన్నికలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఇక చేరికలు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో
పీసీసీ ఛీఫ్ సహా పలు పదవుల్లో పనిచేసి ఆ తర్వాత బీజేపీలో చేరి ఎంపీ కూడా అయిన అశోక్ తన్వర్ గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు.

అయన ఇవాళ్టి వరకూ బీజేపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకూ బీజేపీకే ప్రచారం చేసిన ఆయన.. గంట తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫుున రాహుల్ గాంధీ చేసిన ర్యాలీలో ప్రత్యక్షమయ్యారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. దీంతో కాసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్ధితి. చివరికి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో అశోక్ తన్వర్ బీజేపీని వీడినట్లు అందరికీ అర్ధమైంది.












Click it and Unblock the Notifications