Former CM: మాజీ సీఎం కోసం త్యాగం చెయ్యడానికి సిద్దం అయిన కొడుకు, నేను రెఢీ !

బెంగళూరు/ మైసూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కోసం తన నియోజక వర్గం త్యాగం చెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నానని ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ యతీంధ్ర సిద్దరామయ్య స్పష్టం చేశారు. వరుణా నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య పోటీ చెయ్యాలని ప్రజలు కోరుకున్నా, లేదా అక్కడి నుంచి పోటీ చెయ్యాలని సిద్దరామయ్య బావించిన అందుకు ఆసీటు త్యాగం చెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నానని డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య చెప్పారు.

గతంలో వరుణా నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు, కర్ణాటకలో గత శాసనసభ ఎన్నికల సందర్బంగా వరుణా నియోజక వర్గం కొడుకు యతీంధ్రకు ఇచ్చిన సిద్దరామయ్య బాదామి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇప్పుడు సిద్దరామయ్య వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని, ఆయన కుమారుడు యతీంద్ర చాముడేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

 Former CM: I will give my constituency to EX CM Siddaramaiah, says Yatindra Siddaramaiah in Mysuru in Karnataka.

ఈ విషయంలో సోమవారం డాక్టర్ యతీంధ్ర మైసూరులో మీడియాతో మాట్లాడారు. తన తండ్రి వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే నేను చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని యతీంధ్ర స్పష్టం చేశారు. వరుణా నియోజక వర్గంలోనే పని చేస్తూ తన తండ్రి, మాజీ సీఎం సిద్దరామయ్య భారీ మెజారిటీతో విజయం సాధించడానికి పని చేస్తానని డాక్టర్ యతీంధ్రా అన్నారు.

దావణగెరెలో సిద్దరామోత్సవం కార్యక్రమం నిర్వహించడం బలప్రదర్శన కాదని, అది మాజీ సీఎం సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకలని, దయచేసి ఆ వేడుకలను రాజకీయం చెయ్యకూడదని ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ యతీంధ్ర అన్నారు. పార్టీలకు అతీతంగా దావణగెరెలో సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకలు సిద్దరామోత్సవం పేరుతో నిర్వహిస్తున్నారని డాక్టర్ యతీంధ్ర మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+