Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం కుర్చీ ఎప్పుడు పోతుందో తెలీదు, ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలీదు !

బెంగళూరు/మండ్య: కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడు బద్దలవుతుందో తెలియదని, సీఎం కుర్చీలోని నాలుగు కాళ్లలో సిద్దరామయ్య రెండు కాళ్లు, డీకే. శివకుమార్ రెండు కాళ్లు పట్టుకుని లాగుతున్నారని, ఆ కుర్చీ ఎప్పుడు పడిపోతుందో తెలియదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటకలోని మండ్యాలోని కాళికాంభ కమ్యూనిటీ భవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాజీ సీఎం సదానందగౌడ మాట్లాడారు.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోరుబాట పట్టిస్తోందన్నారు. అంతా కేంద్రం వైపే చూపిస్తున్నారని మాజీ సీఎం సదానందగౌడ మండిపడ్డారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పనులన్నింటినీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం వదిలేసిందని, ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు గుర్తు చేసుకుంటే మంచిదని సదానంద గౌడ అన్నారు.

Former CM Sadananda Gowda says that it is impossible to say when the Karnataka government will collapse

సాధారణంగా చట్టాలను సవరించడం ఆనవాయితీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసే స్థాయికి వెళ్లడం సిగ్గుచేటని సిద్దరామయ్య ప్రభుత్వం మీద మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 నుంచి మంచి పనులు అమలు చేస్తోందని, కేంద్ర మంత్రివర్గంలోని ఏ ఒక్క మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు లేవని, . 2013లో 252 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019లో 320కి పైగా సీట్లు గెలుచుకుందని సదానంద గౌడ గుర్తు చేశారు.

Former CM Sadananda Gowda says that it is impossible to say when the Karnataka government will collapse

2024లో 350 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని సదానందగౌడ చెప్పారు. కర్ణాటకలో ఓడిపోయాం అని బీజేపీ కార్యకర్తలు బాదపడకూడదని, వాజ్‌పేయి కూడా ఓడిపోయారని, మీరు నిరుత్సాహపడకండి, ఓడిపోయిన చోటి నుంచి మళ్లీ మనం గెలవాల్సిన సమయం ఆసన్నమైందని, మండ్య, బెంగళూరు రూరల్, హాసన్ నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని సదానంద గౌడ బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కినందుకు కాంగ్రెస్ పశ్చాత్తాపపడుతోందని, సీఎం సిద్ధరామయ్య మూలుగుతున్నారని, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని పాకులాడుతున్నారని మాజీ సీఎం సదానంద గౌడ విరుచుకుపడ్డారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+