కర్ణాటకలో కాంగ్రెస్ దే అధికారం, సాంబా రాసుకో, మోదీ ప్లాన్ రివర్స్, సిద్దూ !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నామని, ఇప్పుడు కౌంటింగ్ లో కూడా మేము దూసుకుపోతున్నామని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలో శనివారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జోరుగా సాగుతోంది. మైసూరులోని మహారాణి కాలేజ్ లో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన మాజీ సీఎం సిద్దరామయ్య అక్కడ జరుగుతున్న కౌంటింగ్ తీరును పరిశీలించారు. తరువాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసిన సిద్దరామయ్య మంచి జోష్ తో బొటన వేలూ (థమ్స్ అప్) చూపిస్తూ విజయం మనదే అని అన్నారు.

తరువాత మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల మీద విమర్శలు గుప్పించారు. కర్ణాటకలోని ప్రజలు చాలా బుద్దిమంతులు, తెలివైన వాళ్లు అని, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా వారి ప్లాన్ లు ఫలించలేదని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి మేము చాలా ధీమాగా చెబుతున్నాము, కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానని, కర్ణాటకలో 120 సీట్లకు పైగా సొంతం చేసుకుని ఎవ్వరి మద్దతు అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందులో ఎలాంటి డౌట్ లేదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

వరుణ నియోజక వర్గంలో తాను 8 వేల ఓట్లకు పైగా లీడ్ లో ఉన్నానని, ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉందని, వరుణాలో, చామరాజనగరలో రెండు చోట్ల బీజేపీ నాయకుడు సోమణ్ణ ఓడిపోతారని సిద్దరామయ్య అన్నారు. అయితే సీఎం ఎవరు అనే విషయంలో సిద్దరామయ్య మీరే వేచి చూడండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications