గోవాలో బీజేపీకి షాక్: పార్టీకి మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ రాజీనామా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

పనాజి: గోవా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో రాజకీయాలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, గోవా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్... అధికార బీజేపీకి రాజీనామా చేశారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

వార్తా సంస్థ పీటీఐతో 65 ఏళ్ల నాయకుడు లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడుతూ.. పార్టీలో కొనసాగాలని కోరుకోవడం లేదని, ఈ సాయంత్రంలోగా అధికారికంగా తన రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. పర్సేకర్ ప్రస్తుతం రాబోయే గోవా ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు, పార్టీ కోర్ కమిటీ సభ్యుడు కూడా.

Former Goa CM Laxmikant Parsekar quits BJP, says will contest independently

2002, 2017 మధ్య పర్సేకర్ ప్రాతినిధ్యం వహించిన మాండ్రేమ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దయానంద్ సోప్టేని బీజేపీ నామినేట్ చేసింది. సోప్టే 2017 రాష్ట్ర ఎన్నికలలో పర్సేకర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడించారు, అయితే 2019లో మరో తొమ్మిది మంది నాయకులతో కలిసి అధికార బీజేపీలో చేరారు.

'నేను ఇన్నాళ్లు బీజేపీ సభ్యుడిగా ఉన్నా, పార్టీ నన్ను పెద్దగా పట్టించుకోలేదు. పార్టీకి వీడేందుకు సిద్ధమయ్యాను. స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు రోజుల్లో ఈ ప్రకటనతో బయటకు వస్తాను' అని లక్ష్మీకాంత్ పర్సేకర్ స్పష్టం చేశారు.

మాండ్రెమ్‌లోని అసలు బీజేపీ కార్యకర్తలను సోప్టే నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని కారణంగా వారిలో పెద్ద ఎత్తున ఆగ్రహం ఉందని పర్సేకర్ అన్నారు.

లక్ష్మీకాంత్ పర్సేకర్ 2014, 2017 మధ్య గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+