కాశ్మీర్‌‌కు వెళ్లాలంటే భయపడ్డ: మాజీ హోంమంత్రి, కాంగ్రెస్‌ను ఏకిపారేసిన..!!

మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాశ్మీర్‌లో పర్యటించాలంటే చాలా భయపడేవాడినంటూ చెప్పుకొచ్చారు. "ఫైవ్ డికేడ్స్ ఆఫ్ పాలిటిక్స్ "అనే తన జ్ఞాపకాల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. షిండే వ్యాఖ్యలపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం బలోపేతమైందని వెల్లడించింది.

తాను మంత్రిగా ఉన్న సమయంలో కాశ్మీర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించినప్పుడు చాలా భయం వేసిందని చెప్పుకొచ్చారు.తాను హోంమంత్రి కాకముందు విద్యావేత్త విజయ్ ధార్‌ను కలిసినట్టు చెప్పిన షిండే... అతన్నుంచి సలహాలు తీసుకునే వాడని గుర్తుచేసుకున్నారు. శ్రీనగర్‌లో లాల్‌చౌక్‌ను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడాలని సూచించినట్లు షిండే వెల్లడించారు.ఆ తర్వాత దాల్ సరస్సు వద్ద కాస్త సమయం గడపమన్నారని షిండే చెప్పారు.ఇక హోంమంత్రి అయ్యాక విజయ్ ధార్ సూచించినట్లే ఆయన దాల్ సరస్సు వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. దీంతో తనకు పూర్తి పబ్లిసిటీ వచ్చిందని చెప్పిన షిండే.. అక్కడి ప్రజలు కూడా ఈ హోంమంత్రికి అసలు భయమే లేదని గుసగుసలాడుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నాకు లోపల చాలా భయమేసిందన్నారు. అప్పుడు తన బాధ ఎవరితో చెప్పుకోలేకపోయానని చెప్పారు.

Former Home Minister Sushil Kumar Shinde Admits Fear of Visiting Kashmir BJP Taunts Congress

ఇక షిండే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది.బీజేపీ నేత కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ షిండేపై విరుచుకుపడ్డారు. బీజేపీకి కాంగ్రెస్‌ మధ్య తేడా ఇదే అని అన్నారు. ఒక హోంమంత్రి కాశ్మీర్‌లో పర్యటించేందుకు భయపడ్డారు.. కానీ మోదీ ప్రభుత్వంలో ఏటా 2 నుంచి 3 కోట్ల మంది పర్యాటకులు జమ్ము కశ్మీర్‌ను సందర్శిస్తున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని చెప్పుకొచ్చారు. ఈ ఆర్టికల్ రద్దు కావడంతో అవినీతి, వారసత్వపు రాజకీయాలు, కాష్మీరీలపై దాడులు అన్నీ క్రమంగా మాయమైయ్యాయని గుర్తు చేశారు.

ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కాశ్మీర్‌లో తన భారత్ జోడో యాత్రను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగించారు. అంతేకాదు కశ్మీర్‌లో మంచుతో కూడా చక్కగా ఆడుకున్నారని మరో బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనవాల్ల గుర్తుచేశారు. కానీ ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు తిరిగి జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రవాదం వైపు నడిపేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో పొత్తుతో వెళుతున్న కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఆర్టికల్ 370 రద్దును తమ ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయి.అధికారంలోకి వస్తే తిరిగి దాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఒక నిబంధన.డిఫెన్స్, కమ్యూనికేషన్లు, విదేశీ వ్యవహారాలు మినహా ఆ రాష్ట్ర అంతర్గత విషయాలపై పూర్తి హక్కు కలిగి ఉంటుంది. సొంత రాజ్యాంగం, జెండా, స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటానికి ఆర్టికల్ 370 అనుమతిస్తుంది. అయితే 2019లో రెండవ సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ఆగష్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను సమర్థవంతంగా తొలగించింది.జమ్మూ, కాశ్మీర్, ఇంకా లడఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+