కాలేజ్ అమ్మాయిలు లైంగిక ఉచ్చులోకి: సెంట్రల్ జైల్లో మేడమ్ విచారణ, ఎంత మంది!
Recommended Video

మదురై: తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా అరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ అరెస్టు అయిన లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మాజీ ఐఏఎస్ అధికారి సంతానం ఏకసభ్య కమిషన్ విచారణ చేసి వివరాలు సేకరించింది.

మదురై సెంట్రల్ జైలు
మాజీ ఐఏఎస్ అధికారి సంతానం మదురై సెంట్రల్‌జైలుకు వెళ్లి నిర్మలా దేవిని విచారణ జరిపారు. కాలేజ్ అమ్మాయిలను ఎందుకు లైంగిక ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించారు, అమ్మాయిలతో లైంగిక కోరికలు తీర్చుకోవడం కోసం అధికారులు ఎవరెవరు మిమ్మల్ని సంప్రధించారు అని ప్రశ్నించారని తెలిసింది.

కామాంధులు ఎవరు?
మదురై కామరాజర్ యూనివర్శిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ తో పాటు కాలేజ్ అమ్మాయిలను సరఫరా చెయ్యాలని నిర్మలా దేవిని అడిగిన వారి గురించి మాజీ ఐఏఎస్ అధికారి సంతానం పూర్తి వివరాలు అడిగారని తెలిసింది. సంతానంతో పాటు ప్రొఫెసర్లు త్యాగేశ్వరి, కమలి తదితరులు నిర్మలా దేవిని దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించారు.

మేడమ్ స్నేహితురాలు
తూత్తుకూడికి చెందిన మహిళా కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జెసింత తమిళమలర్ కు సీబీసీఐడి అధికారులు సమన్లు జారీ చేశారు. రెండోసారి సమన్లు అందుకున్నఅసిస్టెంట్ ప్రొఫెసర్ జెసింత తమిళమలర్ అధికారుల ముందు విచారణకు రెండో సారి హాజరైనారు.

తప్పనిసరి పరిస్థితి
విద్యార్థినులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో తప్పనిసరి పరిస్థితిలో నిర్మలా దేవితో కలిసి మదురైలో ఒకే గదిలో ఉన్నానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని, విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని జెసింత తమిళమలర్ సీబీసీఐడీ అధికారులకు చెప్పారు. అయితే సీబీసీఐడీ అధికారులు సేకరించిన కొన్ని ఆధారాలలో మరోసారి జెసింత తమిళమలర్ ను విచారణ చేశారు.

కామాంధుల విచారణ
మదురై కామరాజర్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ ను అరెస్టు చేసిన సీబీసీఐడీ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మురుగన్ నోరు విప్పడం లేదని, పెద్దల పేర్లు చెప్పడం లేదని తెలిసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications