జైల్లో శశికళ కలకలం: మరో లేఖ రాసిన రూప, డీజీపీ పరుగు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని ఆరోపణలు రావడంతో రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో విచారణ మొదలైయ్యింది. ఒక్క నెలలో సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని సీఎం సిద్దరామయ్య సూచించారు.

సెంట్రల్ జైల్లో శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూపకు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి మద్దతు!

డీఐజీ రూప ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ మొదలు పెట్టాలని రిటైడ్ ఐఏఎస్ అధికారి సిద్దం అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీ రూప ప్రభుత్వానికి, పై అధికారులకు ఇచ్చిన నివేదిక మీడియాకు ఎలా లీక్ అయ్యింది ? అనే కోణంలో విచారణ చెయ్యాలని వినయ్ కుమార్ నిర్ణయించారని తెలిసింది.

మొదట వారిద్దరే టార్గెట్ !

మొదట వారిద్దరే టార్గెట్ !

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, నకిలి స్టాంపుల కుంబకోణంలో అనేక సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ తెల్గీ విషయంలో ఏలాంటి సౌకర్యాలు కల్పించారు ? అని ఆరా తీస్తున్నారు.

Sasikala Corruption Case : IPS officer who exposed AIADMK leader's life in jail | Oneindia News
వీవీఐపీ సౌకర్యాలు ?

వీవీఐపీ సౌకర్యాలు ?

శశికళ, అబ్దుల్ తెల్గీకి వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని డీఐజీ రూప ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో ఎంత నిజం ఉంది ? అని విచారణ మొదలు పెట్టారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ ఉన్న బ్యారక్, తెల్గీ ఉంటున్న బ్యారక్ లోని సాటి ఖైదీలను విచారణ చెయ్యాలని వినయ్ కుమార్ నిర్ణయించారని తెలిసింది.

డీజీపీ పరుగో పరుగు

డీజీపీ పరుగో పరుగు

ఆదివారం వినయ్ కుమార్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకునే అవకాశం ఉందని తెలుసుకున్న కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావ్ ఆకస్మికంగా జైలు దగ్గరకు వెళ్లారు. జైలును శుభ్రం చేయించి వీవీఐపీ సౌకర్యాలు మొత్తం తీసివెయ్యాలని అక్కడి సిబ్బందికి సూచించారని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

మరో లేఖ రాసిన డీఐజీ రూప

మరో లేఖ రాసిన డీఐజీ రూప

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న అక్రమాలపై విచారణకు ఆదేశించడంతో డీఐజీ రూప స్వాగతించారు. ఇదే సమయంలో జైళ్ల శాఖ అధికారులతో సహ ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ జైలర్ కృష్ణకుమార్ ను విచారణ చేసి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.

నన్ను టార్గెట్ చేస్తున్నారు !

నన్ను టార్గెట్ చేస్తున్నారు !

గతంలో మహిళా ఐపీఎస్ అధికారి సానియా నారంగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి సంచలనానికి తెర లేపారు. ఇప్పుడు డీఐజీ రూప కూడా మీడియాకు విషయం చెప్పి మరో చర్చకు కేంద్ర బిందువు అయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Retired IAS officer Vinay Kumar and team begins its probe charges of irregularities at the Bengaluru central prison in Parappana Agrahara, including preferential treatment to AIADMK (Amma) leader V K Sasikala.
Please Wait while comments are loading...