జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత!
Farooq Abdullah: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం శ్రీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ వారం ప్రారంభంలోనే ఫరూక్ అబ్దుల్లాకు కడుపులో ఇన్ఫెక్షన్ మొదలైంది. చికిత్స కోసం ఆయనను శ్రీనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని.. త్వరలోనే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకులు తెలిపారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫరూక్..
87 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లా.. జమ్మూ కశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగుపడుతోందని పార్టీ నాయకులు తెలిపారు. నేడు లేదా రేపు ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

లడఖ్‌ఫై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
కాగా గత గురువారం రోజున ఫరూక్ అబ్దుల్లా లడఖ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. లడఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్రం వారితో చర్చలు జరపాలని ఆయన సూచించారు. రాష్ట్ర హోదా కోసం లేహ్‌లో హింస జరిగిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.."నేను ప్రభుత్వానికి చెప్పదలిచింది ఏమిటంటే, లడఖ్ ఒక సరిహద్దు రాష్ట్రం. చైనా పొంచి ఉంది, అది ఇప్పటికే భూమిని ఆక్రమించింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం చర్చల ద్వారా దీనిని పరిష్కరించాలి" అని అన్నారు.
హింసకు సోనమ్ వాంగ్‌చుక్ బాధ్యుడు కాదు..
లడఖ్‌లో జరిగిన హింసకు వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ను బాధ్యుడిగా చూపించడం గురించి అడిగినప్పుడు.. అశాంతికి కార్యకర్తలు బాధ్యులు కారని అన్నారు. "ఆయన (వాంగ్‌చుక్) ఎప్పుడూ గాంధేయ మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజు యువత ఆయనను పక్కన పెట్టారు, దానికి ఆయన బాధ్యుడు కాదు. వారు (బీజేపీ) ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, వారు భద్రతా చట్టాన్ని అమలు చేసి ప్రజలను జైలులో పెట్టారు. ఇప్పుడు వారు సీబీఐని ఉపయోగిస్తున్నారు. అణచివేతకు ఎంత ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే, ప్రమాదం అంత పెరుగుతుంది. భారత ప్రభుత్వం బలాన్ని ఉపయోగించవద్దని, చర్చలు జరపాలని నేను కోరుతున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications