ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ సీఎం, మోదీ అడ్డాలో ఏం జరుగుతోంది, వికెట్ మీద వికెట్లు!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుండి రిటైర్మెంట్ సంచలన ప్రకట చేశారు. కర్ణాటకలోని హాసన్‌లో మాజీ సీఎం డీవీ సదానందగౌడ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ వలన తాను చాలా ఎక్కువగానే లబ్ది పొందానని, అంతకు మించి పార్టీ నుంచి ఆశించడం లేదని, అలా అనుకుంటే ప్రజలు తనను తప్పుగా ఊహించుకుంటారని అన్నారు.
ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని, నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీ తనకు అన్నీ ఇచ్చిందని, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా, 20 ఏళ్లు ఎంపీగా, ఏడాది కర్ణాటక ముఖ్యమంత్రిగా, నాలుగు ఏళ్లు కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఏడేళ్లపాటు కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేశానని డీవీ సదానందగౌడ చెప్పారు.

తనకు ఇంకా ఎక్కువ కోరికలుంటే తనను స్వార్థపరుడు అంటారని సదానందగౌడ మొహమాటం లేకుండా చెప్పారు. హాసన్ జిల్లాలో పంట నష్టం సర్వే చేసిన అనంతరం సదానంద గౌడ మీడియాతో మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి చెందిన వివిధ బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
ఈ నివేదికను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు సమర్పించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ తో పొత్తుపై కర్ణాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎన్డీయే కూటమికి సంబంధించి మన కేంద్ర నేతలు నిర్ణయం తీసుకుంటారని, ఆ విషయం అందరికి తెలిసిందే అని సదానందగౌడ చెప్పారు.
అయితే జేడీఎస్ తో పొత్తుపై బీజేపీ కార్యకర్తలు అంగీకరించలేదని, ఇన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్న పార్టీతో హఠాత్తుగా పొత్తు పెట్టుకోవడం సరికాదని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారని, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం అని మాజీ సీఎం సదానందగౌడ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో దీన్ని అమలు చేసేందుకు తగిన మార్గదర్శకాలు చెయ్యాలని తాను కేంద్రంలోని పెద్దలను కోరామని డీవీ సదానందగౌడ తెలిపారు.

కర్ణాటక విపక్ష నేత నియామకం, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి నియామకాల్లో జాప్యం జరుగుతోందని, ఆ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నానని సదానందగౌడ అన్నారు. ఈ విషయాలు తనను ఇబ్బంది పెట్టామని మాజీ సీఎం సదానందగౌడ అంగీకరించారు. ఈ విషయమై మన నేతలు వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించారని, త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటారని మాజీ సీఎం సదానందగౌడ అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై ప్రకటన చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నదని సదానందగౌడ చెప్పారు. 2021లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు సదానంద గౌడ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నారు.
అయితే జేడీఎస్ తో పొత్తు విషయంలో మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మాజీ సీఎం సదానందగౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని హఠాత్తుగా ప్రకటించడంతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం సీటు కావాలని జేడీఎస్ కోరుకుంటున్నదని, అందుకే తనకు సీటు దక్కదని తెలుసుకున్న సదానందగౌడ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని కర్ణాటకకు చెందిన కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. కర్ణాటకకు చెందిన మాజీ సీఎంలు బీఎస్ యడియూరప్ప, సదానందగౌడ ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై చెప్పారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications