హైకమాండ్ మీద మాజీ సీఎం ఫైర్, ఇలాగే ఉంటే ఎన్నికల్లో జెండాపై కపిపారాజు, సార్ చూడండి !

బెంగళూరు: బీజేపీ హైకమాండ్‌పై కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ ఎంపీ సదానంద గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ హైకమాండ్ కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ నాయకులను ఏ విషయంలోనే పట్టించుకోవడంలేదని, వారి మాటలకు విలువ ఇవ్వడం లేదని మాజీ సీఎం సదానందగౌడ సంచన వ్యాక్యలు చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తరువాత కర్ణాటక బీజేపీ నేతల సలహాలు, సూచనలను వినడంలో బీజేపీ హైకమాండ్ విఫలం అయ్యిందని డీవీ సదానంద గౌడ ఆరోపించారు. బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ సదానంద గౌడ ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌పై మాజీ సీఎం సదానంద గౌడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Former Karnataka CM Sadananda Gowda made sensational comments on the BJP high command

కర్ణాటక బీజేపీ నేతలపై కేంద్ర నాయకత్వం ఎలాంటి ద్వేషాలు పెట్టుకోరాదని మాజీ సీఎం సదానందగౌడ మనవి చేశారు. కర్ణాటక నేతలను బీజేపీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకోకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం అని డీవీ సదానందగౌడ జోస్యం చెప్పారు. కేంద్రంలోని బీజేపీ నేతలపై కర్ణాటక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని డీవీ సదానందగౌడ అన్నారు.

వివిధ కారణాల వల్ల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట వాస్తవమే అని, దీంతో ఆగ్రహించిన కేంద్ర నేతలు కర్ణాటకలో అడుగుపెట్టడం మానేశారని, ప్రతిపక్ష నేతలు, పార్టీ అధ్యక్షుల నియామకాల్లో జాప్యం చేయడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి సదానందగౌడ విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు తీసుకుంటున్న చర్యలు పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సదానందగౌడ అన్నారు.

మాజీ సీఎం సదానంద గౌడ విలేకరుల సమావేశం ముగిసిన కొన్ని గంటల తర్వాత బీజేపీ హైకమాండ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను రాష్ట్ర శాఖ చీఫ్‌గా నియమించింది. నళిన్ కుమార్ కటీల్ పదవీ కాలం గతేడాది ఆగస్టుతో ముగిసింది. ఆ తర్వాత మే నుంచి బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అయితే కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు.

Former Karnataka CM Sadananda Gowda made sensational comments on the BJP high command

గత జూలైలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ శాసనసభలో పార్టీ తాత్కాలిక నేతగా నియమితులయ్యారు. కర్ణాటక బీజేపీ నేతలతో చర్చలు జరపాలని సదానంద గౌడ బీజేపీ హైకమాండ్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కూడా కర్ణాటక నేతలను విశ్వాసంలోకి తీసుకోవాలని కేంద్ర నేతలకు మాజీ సీఎం సదానందగౌడ విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తిగా పనిచేస్తామని, బీజేపీ విజయానికి పని చేస్తామని సదానందగౌడ బీజేపీ హైకమాండ్ కు హామీ ఇచ్చారు.

ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ గురించి మాట్లాడుతూ తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడిలేదని సదానందగౌడ చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని, పార్టీ నాకు 30 ఏళ్లుగా అన్నీ ఇచ్చిందని, బీఎస్‌ యడ్యూరప్ప తర్వాత పార్టీలో తరువాత స్థానంతో పాటు అన్ని పదవులు అనుభవించానని మాజీ సీఎం సదానందగౌడ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+