మాజీ సీఎం సంచలన నిర్ణయం, పాత నీళ్లకంటే కొత్త నీళ్లు రుచి ఎక్కువ ?, నేను అంతే !

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఇటీవల మైసూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిద్దరామయ్య స్టేట్ మెంట్ కలకలం రేపింది. దీంతో పాటు కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు.

కర్ణాటకకు చెందిన మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయ్యను అని ప్రకటించారు. నాకు ఓటు వెయ్యండి అంటూ ఇక ముందు మీ దరిదాపుల్లోకి కూడా రానని రమేష్ కుమార్ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ఎం వీరప్ప మొయిలీ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తేదీ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ సమయంలో సీనియర్ నాయకులు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది.

Former Karnataka CM Veerappa Moily has left direct politics

ఈసారి చిక్కబళ్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం వీరప్ప మొయిలీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన వీరప్ప మొయిలీ రాజకీయాలు వద్దు అని అనుకున్నారని తెలిసింది. కాంగ్రెస్ హైకమాండ్ మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలినీ వదిలి చిక్కబళ్లాపూర్ నుండి యువ నాయకుడు రక్షా రామయ్యను పోటీకి దింపింది.

Former Karnataka CM Veerappa Moily has left direct politics
ఎంపీ టికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన మాజీ సీఎం వీరప్ప మొయిలీ ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రక్షా రామయ్యకు మద్దతు ఇస్తున్నానని ప్రకటించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ 1974 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వీరప్ప మొయిలీ 19 నవంబర్ 1992 నుంచి 11 డిసెంబర్ 1994 వరకు కర్ణాటక 13వ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

యూపీఏ హయాంలో వీరప్ప మొయిలీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఉడిపి జిల్లాలోని కర్కల నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. 2009 నుంచి 2019 వరకు చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రిగా, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రిగా వీరప్ప మొయిలీ పనిచేశారు. కర్ణాటక మాజీ సీఎంలు బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు మరో మాజీ సీఎం వీరప్ప మొయిలీ కూడా రాజకీయల నుంచి తప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+