నేడు ఈడీ ముందుకు అనిల్‌ దేశ్‌ముఖ్‌-మనీలాండరింగ్‌ కేసులో-మండిపడ్డ పవార్‌

100 కోట్ల ముడుపుల ఆరోపణలతో పదవి కోల్పోయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆయనపై నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ఆయన్ను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. గత ఆదివారం అనిల్ దేశ్‌ముఖ్‌ మాజీ పీఎస్‌ సంజీవ్‌ పాండే, పీఏ కుందన్‌ షిండేను అరెస్టు చేసి 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. వారి నుంచి లభించిన సమాచారంతో అనిల్‌కు సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో అనిల్‌ దేశ్‌ముఖ్ పాత్ర నిర్ధారణ అయితే ఆయనకు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

former maharastra minister anil deshmukh to appear before ED in money laundering case

ముంబై బల్లార్డ్‌ ఎస్టేట్‌లో అనిల్‌ దేశ్‌ముఖ్‌ వద్ద పనిచేసిన ఇద్దరు సిబ్బందిని విచారించిన ఈడీ... వారు తమకు సహకరించలేదని చెప్తున్నారు. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మండిపడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతూ తమను టార్గెట్‌ చేస్తున్నాయని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+