ఎంపీ టిక్కెట్ కోసం టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ మంత్రి రెడ్డి పోటాపోటి, మోదీకి కోపం వస్తే అక్కడ కథ క్లోజ్!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిక్కబళ్లాపూర్ లోక్‌సభ టిక్కెట్ కోసం బీజేపీ శిబిరంలో తీవ్రస్థాయిలో లాబీయింగ్ జరగడంతో హైకమాండ్ నేతలు తలలు పట్టుకున్నారు. ఒకరికి సీటు మరొకరికి సీటు కాదంటే వాళ్లు పార్టీ కోసం పని చెయ్యరని బీజేపీ హైకమాండ్ కు అనుమానం మొదలైయ్యిందని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సరిహద్దులోని చిక్కబళ్లాపూరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన మాజీ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి అలియాస్ సుధాకర్ చిక్కబళ్లాపూరం లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి భారీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన మాజీ మంత్రి సుధాకర్ ఎంపీ టిక్కెట్ కోసం డిమాండ్ చేశారని తెలిసింది. చిక్కబళ్లాపూరం లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన మాజీ మంత్రి సుధాకర్ ఆయన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.

బీజేపీ హైకమాండ్ నుంచి తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, అందుకే లోక్ సభ ఎన్నికల్లో తనకు గెలిపించడానికి ప్రయత్నించాలని మాజీ మంత్రి సుధాకర్ చెప్పారని ఆయన అనుచరులు అంటున్నారు. ఇక బెంగళూరులోని యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్ రెడ్డి అలియాస్ విశ్వనాథ్ కూడా ఆయన కుమారుడు అలోక్‌కు ఎంపీ టికెట్ ఇప్పించడానికి ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ మంత్రి సుధాకర్ ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో యాక్టివ్‌గా మారారని విశ్వనాథ్ ఆరోపించారని తెలిసింది.
తాజాగా సుధాకర్ ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై సుదీర్ఘంగా మాట్లాడారు. చిక్కబళ్లాపూరం లోక్ సభ నియోజకవర్గంపై చర్చించేందుకు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిశారు. చిక్కబళ్లాపూరంలో మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ ఆయన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిని తాను కలిశానని, చిక్కబళ్లాపురంలో తన గెలుపుకు సహకరించాలని మనవి చేశానని, తనకు వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల కోసం నా పని నేను మొదలు పెట్టానని మాజీ మంత్రి సుధాకర్ ఆయన మద్దతుదారులకు చెప్పారు. అయితే సుధాకర్ ప్రకటనపై స్పందించిన యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్.విశ్వనాథ్.. పార్టీ ప్రకటనకు ముందు తానే అభ్యర్థినని ఎవరూ చెప్పుకోవద్దని మాజీ మంత్రి సుధాకర్‌కు కౌంటర్ ఇచ్చారు. చిక్కబళ్లాపూర్ లోక్‌సభ టికెట్ విషయంలో సుధాకర్ ఇలా అసత్య ప్రచారాలు చెయ్యడం మంచిది కాదని బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ అన్నారు.

బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదని, ఎంపీ టిక్కెట్లను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని, సుధాకర్ బీజేపీలోకి కొత్తగా వచ్చారని, బీజేపీ సిద్దాంతాలు తెలీకుండా ఆయన మాట్లాడుతున్నారని యలహంక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ మండిపడుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడు అయిన యలహంక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆయన కుమారుడు అలోక్ కు చిక్కబళ్లాపురం ఎంపీ టిక్కెట్ ఇప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకే పార్టీలోని ఇద్దరు నాయకులు ఎంపీ టిక్కెట్ కోసం పోటీ పడటం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications