మద్యం మత్తులో ఐదుగురి ప్రాణాలు తీశారు: నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకు
ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు.. ఆ మత్తులోనే కారు నడిపి... రోడ్డు పక్కన షెల్టర్‌లో నిద్రిస్తున్న ఐదుగురు కూలీల ప్రాణాలు బలితీసుకున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హజ్రత్‌గంజ్‌లో ఘోరం జరిగింది. ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు.. ఆ మత్తులోనే కారు నడిపి... రోడ్డు పక్కన షెల్టర్‌లో నిద్రిస్తున్న ఐదుగురు కూలీల ప్రాణాలు బలితీసుకున్నారు. హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని దాలిబాగ్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1.20గంటలకు చోటుచేసుకుందీ ఘటన. కాగా, నిందితుల్లో ఒకరు మాజీ ఎమ్మెల్యే కొడుకు కావడం గమనార్హం.
పగలంతా పనులకు వెళ్లిన కూలీలు తమకు కేటాయించిన షెల్టర్‌లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయుష్ కుమార్, నిఖిల్ అరోరా అనే ఇద్దరు యువకులు పూటుగా తాగి కారులో అతివేగంగా షెల్టర్‌లోకి దూసుకొచ్చారు.

ఆ సమయంలో షెల్టర్‌లో నిద్రిస్తున్న కూలీల మీదనుంచి కారు పోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులంతా 30 నుంచి 37 ఏళ్ల మధ్య వయసువారే. మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి.
నిందితుల్లో ఆయూష్ కుమార్ సమాజ్‌వాద్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడని గుర్తించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, కారును సీజ్ చేశారు. సంఘటన జరిగిన సమయంలో షెల్టర్‌లో 35మంది కూలీలు నిద్రిస్తున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications