మోదీకి జలక్, ఒక్క అడుగు ముందుకు వేసిన మాజీ ప్రధాని, లీడర్ పేరు ఇదే, ముందు తెలిసిందా ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి చేతులారా అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పగించిన బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో కనీసం 24 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ ఇప్పటి నుంచి పావులు కదుపుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యాలని బీజేపీ ఇప్పటికే డిసైడ్ అయ్యింది.
జేడీఎస్ కు ఆరు సీట్లు ఇచ్చి మిగిలిన 22 లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే జేడీఎస్ కు ఏ లోక్ సభ నియోజక వర్గాలు కేటాయిస్తారు అని మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. మండ్య, హాసన్ లోక్ సభ నియోజక వర్గాలు జేడీఎస్ కు కచ్చితంగా ఇస్తారని రెండు పార్టీల నాయకులు బహిరంగంగానే అంటున్నారు. అయితే మండ్య, హాసన్ లోక్ సభ నియోజక వర్గాల సీట్ల పంపిణి విషయంలో బీజేపీ ఇంకా అధికారికంగా మాట్లాడలేదు.

హాసన్ లోక్ సభ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్ లోనే వ్యతిరేకత వెల్లువెత్తడంతో మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగాలని స్థానిక జేడీఎస్ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. ఇదే సమయంలో జేడీఎస్ కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ ఆధ్వర్యంలో ఎంపీ, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, హాసన్ జిల్లాలోని నాయకులతో సమావేశమయ్యారు. పంచాయతీ, తాలూకా పంచాయతీ సభ్యుల అభిప్రాయాలు సేకరించారు.

తనకు రాజ్యసభ పదవికాలం ఇంకా ఉంది కాబట్టి ప్రజ్వల్ రేవణ్ణను హాసన్ లో పోటీ చేయించాలని నాయకులు అంటున్నారని, హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని, జేడీఎస్ కార్యకర్తలు ప్రజ్వల్ రేవణ్ణకు సహకరించాలని మాజీ ప్రధాని దేవేగౌడ మనవి చేశారు. మా పార్టీ నేతలతో చర్చించాను. అంతకుముందు లక్ష ఓట్ల తేడాతో ప్రజ్వల్ రేవణ్ణ గెలుపొందారు, ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇంకా ఎక్కువ ఓట్లు, కర్ణాటకలో ఎక్కువ సీట్లలో జేడీఎస్ గెలుస్తుందని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ చెప్పారు.












Click it and Unblock the Notifications