Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరు ఎవరిని అంతం చేస్తారో చూద్దాం, సీఎంను టార్గెట్ చేసిన మాజీ ప్రధాని, పచ్చ గడ్డి వేస్తే !

జేడీఎస్‌లో రాజకీయంగా పైకి వచ్చి మళ్లీ అదే జేడీఎస్‌ పార్టీని అంతమొందించాలన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దురహంకారానికి ఈ లోక్‌సభ ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ జేడీఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హాసన్‌ లో జరిగిన జేడీఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద విరుచుకుపడ్డారు.

మా పార్టీలో పెరిగి పెద్దయ్యాక ఇప్పుడు అధికార అహంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, సీఎం సిద్దరామయ్య వంటి వ్యక్తిని మేము క్షమించినా ప్రజలు క్షమించరని మాజీ ప్రధాని దేవేగౌడ మండిపడ్డారు. నా జిల్లా ప్రజలకు నేను అండగా ఉంటానని మాజీ ప్రధాని దేవేౌడ అన్నారు. హాసన్ జేడీఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణను ఓడించేందుకు మూడుసార్లు హాసన్‌కు వచ్చిన కాంగ్రెస్ నేతల పరువు తియ్యాలని మాజీ ప్రధాని దేవేగౌడ జేడీఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Former Prime Minister HD Deve Gowda lashed out at Karnataka CM Siddaramaiah

లోక్ సభ ఎన్నికల తేదీ సమీపించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని, దేశానికి బలమైన ప్రధాని ఉండకూడదని కాంగ్రెస్ అంటోందని, బలమైన ప్రధాని ఉంటే మేము అడిగినంత డబ్బు ఇవ్వరని కాంగ్రెస్ ఇలా చేస్తోందని మాజీ ప్రధాని దేవేగౌడ ఆరోపించారు. దీనిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

దేశంలోని పరిపాలనా వ్యవస్థలో ఫైనాన్స్ కమిషన్ ప్రతి ఐదేళ్లకోసారి ఒక్కో రాష్ట్రం ఆర్థిక స్థితిగతులను సమీక్షించి ఆర్థిక సమస్యలు ఉన్నవారికి నిధులు కేటాయిస్తుందని, డబ్బులు లేవని అంటూనే కర్ణాటక ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై హడావుడి చేయడం, ఆరోపణలు చెయ్యడం సరికాదా అని మాజీ ప్రధాని దేవేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జేడీఎస్ ఎక్కడ ఉందని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారని, జేడీఎస్ ఎక్కడ ఉందో త్వరలో మీకు చూపిస్తానని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ సిద్దరామయ్యను ఉద్దేశించి అన్నారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్-బీజేపీ కూటమి అభ్యర్థికి హాసన్ జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఓటు వేసి అధిక ఓట్లతో గెలిపించేందుకు కృషి చేయాలని దేవేగౌడ మనవి చేశారు. మండ్య నుంచి జేడీఎస్‌ పోటీ ఖాయం అని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

Former Prime Minister HD Deve Gowda lashed out at Karnataka CM Siddaramaiah

జేడీఎస్ పార్టీని అంతం చేయాలని ఎమ్మెల్యే జీటీ దేవెగౌడకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు, కానీ నేను ఇంకా బతికే ఉన్నాను, జేడీఎస్‌ను అంతం చేయడం అంత ఈజీ కాదని, జేడీఎస్ ఎవరిని అంతం చేస్తుందో చూస్తూ ఉండాలని మాజీ ప్రధాని దేవేగౌడ కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై విరుచుకుపడ్డారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అహంకారానికి ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని, కాంగ్రెస్‌ ఎక్కడ ఉందని అనే ప్రశ్న మీరే వేసుకోవాలని దేవేగౌడ అన్నారు.

కర్ణాటకతో సహా మరో రెండు మూడు రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని జేడీఎస్ ఏం చేస్తుందో త్వరలో మీరే చూస్తారని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. బెంగళూరు మొత్తం ఆదాయాన్ని ఒక్క కాంగ్రెస్ నేత మాత్రమే సేకరిస్తున్నారని, రాష్ట్ర ప్రజల పన్ను సొమ్మును రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పంచుకుంటోందని, త్వరలో సిద్దరామయ్య ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ సిద్దరామయ్యపై విరుచుకుపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+