భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎయిమ్స్‌కు వెళ్లారు. బెల్గావిలో సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీకి హుటాహుటిన బయల్దేరారు. శుక్రవారం నాటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

Former Prime Minister Manmohan Singh 92 passes away

ఢిల్లీ ఎయిమ్స్‌కు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. ఆస్పత్రి వద్ద పెద్ద మొత్తంలో బలగాలు మోహరించాయి. తొలుత భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. ఆ తర్వాత పదేళ్లపాటు ప్రధానిగా సేలందించారు. దేశంలో సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రధానమంత్రుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు.

1932, సెప్టెంబర్ 26, మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్‌లో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. కేంబ్రిడ్జ్ నుంచి పీజీ పట్టా పొందారు. ప్లానింగ్ కమిషన్ చీఫ్‌గా, ఎకనామిక్ అడ్వైజర్‌గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991లో తొలిసారి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

1991-96 వరకు అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. తొలి సిక్కు ఆర్థికమంత్రిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. భారత ఆర్థిక ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఘనత వహించారు.ఇక, 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాయి. 2024లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. పద్మవిభూషణ్ సహా అనేక అవార్డులు, పురస్కారాలను మన్మోహన్ అందుకున్నారు.

మన్మోహన్ సింగ్ ప్రజా సేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ (1987), జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం (1995), ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993-1994), యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956), సెంట్రల్ లండన్ లోని సెంట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ (1955) ఉన్నాయి. అలాగే, పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు మన్మోహన్ సింగ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+