Family: భార్య, అత్తను నరికి చంపేసిన మాజీ సర్పంచ్, మరదలిని వదల్లేదు, క్లైమాక్స్ లో ఆత్మహత్య !

ఇండోర్/హైదరాబాద్: మాజీ సర్పంచ్ ఇంట్లో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న ఆ వ్యక్తి అతని భార్య, అత్తతో పాటు వారి కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రాజకీయ నాయకుడిగా పదిమందికి పంచాయితీలు చేసే తన ఇంటిలోనే ఎక్కువ పంచాయితీలు జరుగుతున్నాయని, నేను ఎవరి దగ్గరకో వెళ్లి పంచాయితీలు చెయ్యండి అని అడుక్కునే పరిస్థితి ఎదురైయ్యిందని మాజీ సర్పంచ్ ఆవేదన చెందాడని తెలిసింది. మాజీ సర్పంచ్ కు అతని స్నేహితులు చాలాకాలం నుంచి నచ్చ చెబుతూ వచ్చారు. ఇదే సమయంలో మాజీ సర్పంచ్ భార్యకు మద్దతుగా ఆమె తల్లి పానకంలో పుడకలా రావడం మొదలుపెట్టింది. భార్యకు, ఆమె అత్త తీరుతో విసిగిపోయిన మాజీ సర్పంచ్ వారి మీద రగిలిపోయాడు. భార్యతో పాటు ఆమె తల్లి, సోదరి, ఆమె భర్తను దారుణంగా నరికేశాడు. భార్య, అత్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తెలుసుకున్న మాజీ సర్పంచ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 మాజీ సర్పంచ్ కు ఫోలోయింగ్ ఎక్కువ

మాజీ సర్పంచ్ కు ఫోలోయింగ్ ఎక్కువ

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలోని ఖాండ్వా తాలుకాలోని మాథేలి గ్రామంలో మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజకీయ నాయయుడిగా కొనసాగుతున్న రాధేశ్యామ్ కు స్థానికంగా అతనికి కంటూ సొంతంగా మంచి ఫాలోయింగ్ పెట్టుకున్నాడని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన రాధేశ్యామ్ మాజీ సర్పంచ్ అయ్యాడు.

మాజీ సర్పంచ్ కు కుటుంబ సమస్యలు

మాజీ సర్పంచ్ కు కుటుంబ సమస్యలు

మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ కు సీమాబాయి అనే భార్య ఉంది. రాధేశ్యామ్ భార్య సీమాబాయి తల్లి షూరాబాయి కూడా అక్కడే నివాసం ఉంటున్నది. మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ ఇంట్లో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న రాధేశ్యామ్ అతని భార్య సీమాబాయి., అత్త షైరాబాయితో పాటు వారి కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

 పది మందికి పంచాయితీలు చేసే నాకే ఇంకోక్కరు పంచాయితీలు చెయ్యాలా ?

పది మందికి పంచాయితీలు చేసే నాకే ఇంకోక్కరు పంచాయితీలు చెయ్యాలా ?

రాజకీయ నాయకుడిగా పదిమందికి పంచాయితీలు చేసే తన ఇంటిలోనే ఎక్కువ పంచాయితీలు జరుగుతున్నాయని, నేను ఎవరి దగ్గరకో వెళ్లి పంచాయితీలు చెయ్యండి అని అడుక్కునే పరిస్థితి ఎదురైయ్యిందని మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ అతని స్నేహితుల దగ్గర కొంతకాలంగా ఆవేదన చెందుతున్నాడని తెలిసింది.

పానకంలో పుడకలా వస్తున్న అత్త

పానకంలో పుడకలా వస్తున్న అత్త

సమస్యలు అందరికి వస్తాయని, అవి త్వరగా పరిష్కారం అయ్యే మార్గం చూసుకోవాలని మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ కు అతని స్నేహితులు చాలాకాలం నుంచి నచ్చ చెబుతూ వచ్చారు. ఇదే సమయంలో మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ భార్య సీమాబాయికి మద్దతుగా ఆమె తల్లి షూరాబాయి పానకంలో పుడకలా ప్రతిసారి రావడం మొదలుపెట్టడటంతో మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ ఇంకా రగిలిపోయాడని సమాచారం.

 భార్య, అత్తను నరికేసిన మాజీ సర్పంచ్

భార్య, అత్తను నరికేసిన మాజీ సర్పంచ్

రాత్రి రాధేశ్యామ్, సీమాబాయి దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఆస మయంలో ఇంట్లో సీమాబాయి తల్లి షైరాబాయి రెచ్చిపోయిందని తెలిసింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రాధేశ్యామ్ వేటకొడవలి తీసుకుని అతని భార్య సీమాబాయి, ఆమె తల్లి షైరాబాయిని ఇష్టం వచ్చినట్లు నరికేశాడు.

 భార్య, అత్త చచ్చారా లేదా అని తెలుసుకున్న మాజీ సర్పంచ్

భార్య, అత్త చచ్చారా లేదా అని తెలుసుకున్న మాజీ సర్పంచ్

భార్య సీమాబాయి, అత్త షైరాబాయి తీరుతో విసిగిపోయిన మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ ఆ ఇద్దరితో పాటు . భార్య రీనా సోదరి రీనాబాయి, ఆమె భర్త ఖాలుపాద్రీని దారుణంగా నరికేశాడు. భార్య సీమాబాయి, అత్త షైరాబాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తెలుసుకున్న రాధేశ్యామ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రీనాబాయి, ఆమె భర్త ఖాలుపాద్రీలను ఆసుపత్రికి తరలించామని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ వివేక్ సింగ్ మీడియాకు చెప్పారు.

 ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్

ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్

భార్య సీమాబాయి, అత్త షైరాబాయిని హత్య చేసిన తరువాత మాజీ సర్పంచ్ రాధేశ్యామ్ ఊరి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ మీడియాకు చెప్పారు. భార్య, అత్తను దారుణంగా నరికి చంపి మాజీ సర్పెంచ్ రాధేశ్యామ్ ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.


పది మందికి పంచాయితీలు చేసే తన ఇంటిలోనే ఎక్కువ రామాయణాలు జరుగుతున్నాయని, నేను ఎవరి దగ్గరకో వెళ్లి పంచాయితీలు చెయ్యండి అని అడుక్కునే పరిస్థితి ఎదురైయ్యిందని మాజీ సర్పంచ్ ఆవేదన చెందాడు. ఆవేశంతో రగిలిపోయిన మాజీ సర్పంచ్ అతని భార్య, అత్తను దారుణంగా నరికి చంపేశాడు. మరదలు, ఆమె భర్తను నరికేసిన మాజీ సర్పంచ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+