Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర మాజీమంత్రి కన్నుమూత: సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కర్ణాటకలోని మంగళూరులోని ఎనెపొయా ఆసుపత్రిలో ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. రెండు నెలల కిందట యోగా చేస్తోన్న సమయంలో కింద పడటం వల్ల తలకు గాయమైంది. దీనితో ఆయన జులై 19వ తేదీన ఆసుపత్రిలో చేరారు. గాయం తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యారు.

తలకు గాయమైనప్పటి నుంచి తరచూ తలనొప్పికి గురవుతుండటంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. స్కానింగ్ చేయగా తలలో రక్తం గడ్డకట్టినట్టు డాక్టర్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి, బ్లడ్ క్లాట్‌ను తొలగించారు. ఆ తరువాత కూడా ఆయన అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. ఆ కొద్ది రోజులకే మళ్లీ గాయం తిరగబెట్టడంతో మళ్లీ కొద్దిరోజుల కిందటే ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం రాలేదు.

Former union minister, Rajya Sabha member Oscar Fernandes passed away in Mangaluru

రొటీన్ డయాలసిస్ కూడా చేయాల్సి రావడం.. గాయం తిరగబెట్టడం వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనితో ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాస పాత్రుడనే పేరు ఉంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఆయన పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్, కార్మిక- ఉపాధి కల్పన శాఖలకు కేబినెట్‌లో ప్రాతినిథ్యాన్ని వహించారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీలోనూ కీలక హోదాల్లో పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి. 1941, మార్చి 27వ తేదీన ఆయన జన్మించారు. ఉడుపి లోక్‌సభ నియోజకవర్గం నుంచి అయిదు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1980లో తొలిసారిగా పోటీ చేసి, ఘన విజయాన్ని అందుకున్నారు. 1984, 1989, 1991, 1996 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది. నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామాగా నిలిచారని పేర్కొంది. సమ్మిళిత అభివృద్ధి కోసం ఆయన కలలు గన్నారని, దాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేశారని తెలిపింది. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొంది. కాంగ్రెస్ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎదిగారని నివాళి అర్పించింది.

Recommended Video

    Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+