Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండీ కూటమిలోకి రండి- చంద్రబాబు, నితీష్ కు యశ్వంత్ సిన్హా ఆహ్వానం..!

దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాక జాతీయ స్ధాయిలో ఇద్దరు నేతలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నారు. ఇందులో ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు కాగా.. మరొకరు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. దీనికి కారణం లోక్ సభ ఎన్నికల్లో వారి పార్టీలు సాధించిన విజయాలే. ఏపీ, బీహార్ లో వీరిద్దరూ సాధించిన విజయాలు ఇప్పుడు ఎన్డీయే కూటమిలో వీరికి రెండు, మూడు స్ధానాల్లో కూర్చోబెట్టాయి.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమకు కావాల్సిన డిమాండ్లు నెరవేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది గమనించిన విపక్ష ఇండీకూటమి ఇప్పటికే వీరికి ఆహ్వానాలు పంపుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన ఎన్డీయే కూటమి భేటీకి ముందు ఇండీ కూటమికి చెందిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా చంద్రబాబు, నితీశ్ కు తమ కూటమిలోకి రావాలని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన వరుస పోస్టులు పెట్టారు.

former union minister Yashwant Sinha invites Chandrababu nitish kumar into india bloc

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తక్షణమే ఎన్డీయే నుంచి భారత కూటమిలోకి మారాలని, వారి చర్యలను చరిత్ర నిర్ణయిస్తుందంటూ యశ్వంత్ సిన్హా కోరారు. మోడీ భారతదేశ భవిష్యత్తును సిగ్గులేకుండా నాశనం చేస్తున్నారని,(1) రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలను లొంగదీసుకోవడానికి ఈడీ, సీబీఐ, ఐటీలను వాడుతున్నారని, ఎన్నికలను, ఎంపీ, ఎమ్మెల్యేలను కొనేందుకు అక్రమ ఎన్నికల బాండ్లు, క్రోనీ క్యాపిటలిస్టుల ద్వారా డబ్బును వాడుతున్నారని ఆరోపించారు.

మీడియా, బ్యూరోక్రసీని, ఈసీని నియంత్రించడం ద్వారా మోడీ మొగలోమానియాను ముందుకు తీసుకెళ్తున్నారని యశ్వంత్ సిన్హా విమర్శించారు. దైవదూతగా చెప్పుకున్న మోడీకి ప్రజలు ఆయన వాస్తవ స్ధానాన్ని చూపించారన్నారు. చరిత్రలో మిగతా నియంతల్లాగే చెత్తబుట్టలో పడేశారన్నారు. నవీన్ బాబు (నవీన్ పట్నాయక్) ఎప్పటి నుంచో బీజేపీకి మద్దతిచ్చినా టైం రాగానే మోడీ అతన్ని మింగేయడానికి వెనుకాడలేదని యశ్వంత్ సిన్హా గుర్తుచేశారు. ఏదో ఒకరోజు మీ గతి కూడా ఇదే కావచ్చని చంద్రబాబు, నితీశ్ లను యశ్వంత్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+