వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాస్ ట్యాంకర్, కంటేనర్ ఢీ, నలుగురి సజీవదహనం, గ్యాస్ ట్యాంకర్ పేలిపోతుందని, హైవేలో టెన్షన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గ్యాస్ ట్యాంకర్, టైర్లు తీసుకువెలుతున్న కంటేనర్ ఎదురెదురుగా ఢీకొనడంతో కర్ణాటకలోని దావణెగెరె జిల్లాలో నలుగురు సజీవదహనం అయ్యారు. గ్యాస్ ట్యాంకర్ లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మాయం కావడంతో వారు సజీవదహనం అయి ఉంటారని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కూతురి ఫ్రెండ్ తో వ్యాపారి అక్రమ సంబంధం, సెక్స్ వీడియోలతో బ్లాక్ మెయిల్, సింపుల్ గా చంపేసింది!కూతురి ఫ్రెండ్ తో వ్యాపారి అక్రమ సంబంధం, సెక్స్ వీడియోలతో బ్లాక్ మెయిల్, సింపుల్ గా చంపేసింది!

 గ్యాస్ ట్యాంకర్, టైర్ల కంటేనర్

గ్యాస్ ట్యాంకర్, టైర్ల కంటేనర్

హైవేలో గ్యాస్ ట్యాంకర్ పేలిపోతుందేమో అంటూ స్థానికులు ఆందోళన చెందారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు పట్టణం సమీపంలోని జాతీయ రహదారి 13లో హరియాణాకు చెందిన గ్యాస్ ట్యాంకర్ వేగంగా వెలుతోంది. అదే సమయంలో టైర్లు లోడ్ చేసిన కంటేనర్ అదే జాతీయ రహదారి 13 లో వేగంగా ప్రయాణిస్తోంది.

నలుగురి సజీవదహనం

నలుగురి సజీవదహనం

గ్యాస్ ట్యాంకర్, కంటేనర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వాటి ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. రెండు వాహనాలు ఢీకొట్టిన వెంటనే టైర్లు ఉన్న కంటేనర్ లో మంటలు వ్యాపించాయి. ఈ పమాదంలో కంటేనర్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్, గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ నలుగురు సజీవదహనం అయ్యారు.

 హైవేలో టెన్షన్ టెన్షన్

హైవేలో టెన్షన్ టెన్షన్

ప్రమాదం జరిగిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్యాస్ ట్యాంకర్ ఎక్కడ పోలిపోతుందే అని ఆందోళనతో స్థానిక గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. గ్యాస్ ట్యాంకర్ లో ఆ వాహనం డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించారని సమాచారం ఉందని, అయితే వారి ఆచూకి మాత్రం లేదని, వారిద్దరూ సజీవదహనం అయి ఉంటారని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Four persons, including two drivers and a cleaner, were killed when a container truck and a gas tanker collided in Davanagere,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X