ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. అంతలోనే ఆ తల్లికి తీరని శోకం..
కొన్నిసంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని ఆనందాన్ని పంచితే.. మరికొన్ని విషాదాన్ని మిగులుస్తాయి. ఇక్కడ జరిగిన అరుదైన సంఘటన విషాదాన్ని మిగిల్చింది. ఒకే కాన్పుల్లో నలుగురు శిశువులకు జన్మినిచ్చింది ఓ గర్బిణీ. అయితే, అంతలోనే ఆ తల్లికి తీరని శోకం మిగిలింది. ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే కన్నుమూసారు. ఈ విషాద సంఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగింది.
గంటల వ్యవధిలోని మృతిచెందిన శిశువులు..
కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఈమెకు ఆదివారం సాయంత్రం నొప్పులు రావడంతో స్థానిక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు కుటుంబసబ్యులు. అయితే, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఆమెను వెంటనే కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు ఆసుప్రతి సిబ్బంది సూచించారు.

ఇక సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రిలో కలీదా సాధారణ ప్రసవం ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ముగ్గురు మగ శిశువులు కాగా, ఒక ఒక ఆడ శిశువు జన్మించారు. అయితే, ఆ శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. అయితే అందులో ముగ్గురు పిల్లలు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, మరొక శిశువును శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.
అక్కడికి వెళ్లాక మరో శిశువు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ తల్లికి తీరని శోకం మిగిలింది. ఈ సంఘటనతో కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం కలీదా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, నెలలు నిండకుండా, తక్కువ బరువుతో జన్మించిన పిల్లలను రక్షించేందుకు అవసరమైన సదుపాయాలు కుప్వారా ఉప-జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేవని కలీదా కుటుంబసభ్యులు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications