టీ పొడి బదులు పురుగుల మందు కలిపిన బాలిక: టీ తాగి నలుగురు మృతి

Subscribe to Oneindia Telugu

దర్బాంగా: బీహార్ రాష్ట్రం దర్బాంగా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్ళ బాలిక కుటుంబసభ్యుల కోసం టీ తయారుచేస్తూ అందులో అనుకోకుండా పురుగుల మందు కలిపింది. కాగా, ఆ టీ తాగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. డీఎస్పీ దిల్నావాజ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. అర్చన అనే పదేళ్ల బాలిక కుటుంబసభ్యుల కోసం టీ తయారు చేస్తూ టీ పొడికి బదులుగా పొరపాటు పురుగుల మందు కలిపేసింది. దీన్ని కుటుంబసభ్యులు తాగేశారు.

Four die after consuming tea laced with poisonous pesticides in Bihar

కాసేపటికే టీ తాగిన దుఖాన్ మహతో(60), రామ్ స్వరూప్ మహతో(65), అర్చన(10) అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ప్రకాశ్ మహతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమీలా దేవీ అనే మహిళ పరిస్థితి విహంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four members of a family, including a 10-year-old girl, died this morning after drinking tea inadvertently mixed with poisonous pesticides in Bihar’s Darbhanga district, police said. Deputy Superintendent of Police Dilnawaz Ahmed said the incident happened in a village falling under Bahadurpur police station area of the district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి