వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ పాట్నా ర్యాలీ టార్గెట్: మరో నలుగురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

జోస్: బిజెపి నేత, కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకుని పాట్నాలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఘటనలో జాతీయ భద్రతా సంస్థ అధికారులు మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన అక్టోబర్ 27వ తేదీన జరిగింది.

అనుమానితులను హైదరాబాద్, నుమాన్, తాఫీఖ్, మిజ్బుల్లాలుగా గుర్తించారు. రాంచీ శివారులోని ఓ గ్రామంలో ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ తెహసీన్ అక్తర్‌తో పాటు ఆ నలుగురు పాట్నా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.

Four More Arrested For Blasts Targeting Narendra Modi's Patna Rally

తెహసీన్ అక్తర్‌ను నేపాల్ సరిహద్దులో మార్చిలో అరెస్టు చేశారు. తాజాగా అరెస్టయిన నలుగురిలో హైదర్ అలియాస్ బ్లాక్ బ్యూటీ రాంచీ మోడ్యుల్ చీఫ్ అని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో మోడీ ర్యాలీ సందర్భంలో ఎనిమిది వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఎన్ఐఎ 8 మందిని అరెస్టు చేసింది. పాట్నా రైల్వే స్టేషన్‌లో బాంబు పెడుతుండగా 9వ నిందితుడు మరణించాడు.

English summary
Four suspected Indian Mujahideen men have been arrested for alleged involvement in the October 27 serial blasts in Patna targeting Narendra Modi's rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X