యువకుడిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు యువతులు..!
నలుగురు యువతులు ఓ యువకుడిని కిడ్నాప్ చేసి మరీ సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో సైతం పెద్ద చర్చకు దారితీసింది. బాధితుడికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మద్యం మత్తులో..
కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలంధర్‌కు చెందిన నలుగురు మహిళలు మద్యం మత్తులో రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న ఓ యువకుడిని బలవంతంగా తమ కారులోకి లాగి ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. కారు లోపల అతడిపై దాడి చేసి అనంతరం జలంధర్ ఔట్ స్కర్ట్స్ లోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ దుశ్చర్య అనంతరం బాధితుడిని రోడ్డుపై వదిలేసి నలుగురు యువతులు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురైన బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.

ఈ ఘటనపై మాట్లాడిన ఓ అధికారి "అమ్మాయిలపై మాత్రమే ఇలా జరుగుతుందని భావించామని... కానీ పురుషులపై కూడా ఇలాంటి గ్యాంగ్‌రేప్‌లు జరగడం ఆశ్చర్యం" అని వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. జెండర్ ఏదైనా అయినా న్యాయం అందాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం సమాజం స్పందించకపోవడం ఏంటని పలువురు యువకులు మండిపడుతున్నారు.
ఇక బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మానసిక ఒత్తిడికి లోనవుతున్నందున, కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతుండగా.. ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. కానీ ఈ రీతిలో యువకుడిపై అఘాయిత్యానికి పాల్పడడం షాక్ కి గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications