తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fraud: పోలీసులకు మామూళ్లు, ఫోర్జరీ, పేరుకు వెరిఫికేషన్, భారత ఆర్మీలో ?, ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటకలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ విజయనగర్: నకిలీ పత్రాలు తయారు చేసి చిన్నచిన్న ఉద్యోగాలు సంపాధించడం సర్వసాధారం అయిపోయిందని చాలాసార్లు వెలుగు చూసింది. అయితే ముగ్గురు పోలీసులకు మామూళ్లు ఇచ్చిన కేటుగాళ్లు నకిలీ పత్రాలు తయారు చేసి ఏకంగా భారతసైన్యంలో ఉద్యోగాల్లో చేరిపోయారు. అయితే ఓ ఉద్యోగి విషయంలో అతని పై అధికారుల పరిశీలనలో నకిలీ పత్రాలు అని అనుమానం రావడంతో సంబంధిత పోలీసులకు వెరిఫికేషన్ కు పంపించారు. కేటుగాడి పత్రాలను పరిశీలిస్తున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు నిరుద్యోగులు నకిలీ పత్రాలతో భారత సైన్యంలో చేరడానికి ముగ్గురు పోలీసులు సహకరించారని వెలుగు చూసింది. ముగ్గురు పోలీసులతో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి అసలు బండారం మొత్తం బయటకు లాగుతున్నారు. ఈ కేసులో తప్పించుకుని పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Illegal affair: పక్కింటోడితో భార్య గర్బవతి అయ్యిందని ?, ఇద్దర్ని నరికి చంపేశాడు, నలుగురి మీద !Illegal affair: పక్కింటోడితో భార్య గర్బవతి అయ్యిందని ?, ఇద్దర్ని నరికి చంపేశాడు, నలుగురి మీద !

 ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?

మహారాష్ట్రకు చెందిన అజిత్ కుండా కలోని అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి భారత సైన్యంలో చేరడానికి ప్రయత్నించాడు. అజిత్ పత్రాలు పరిశీలించిన పై అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఈ పత్రాలను రీ వెరిఫికేషన్ చెయ్యాలని కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హోస్ పేట్ సమీపంలోని హీరేహడగలి పోలీసులకు సూచించారు.

 అన్నీ నకిలీ పత్రాలే

అన్నీ నకిలీ పత్రాలే

ఆధార్ కార్డు, ఆధాయ దృవీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రం, నివాస దృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన అన్ని నకిలీ పత్రాలను సృష్టించారు. తరువాత పోలీసు వెరిఫికేషన్ కు పంపించారు. పోలీసులనే మేనేజ్ చేసిన కిలాడీలు ఆరు మంది భారత సైన్యంలో ఉద్యోగాలు సంపాధించారు.

 తీగలాగితే పోలీసుల డొంక కదిలింది

తీగలాగితే పోలీసుల డొంక కదిలింది

మహారాష్ట్రకు చెందిన అజిత్ కూడా విజయనగర జిల్లాలోని హోస్ పేట్ లోనే నకిలీ పత్రాలు సృష్టించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అజిత్ తో పాటు ఇంకా ఎంతమంది ఇలా నకిలీ పత్రాలు సృష్టించారని పోలీసులు కూపీలాగారు. ఇదే సమయంలో భారత సైన్యంలో ఇప్పటికే చేరిన వారి పత్రాలను వెరిఫికేషన్ చేసిన ముగ్గురు పోలీసుల వివరాలు సేకరించారు.

 ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, మహారాష్ట్ర

ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, మహారాష్ట్ర

పోలీసులను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. నకిలీ పత్రాలను కళ్లు మూసుకుని వెరిఫికేషన్ చేసిన పోలీసులు వారికి క్లీన్ చిట్ ఇచ్చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, మహారాష్ట్రకు చెందిన 10 మందిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు.

Recommended Video

CP Sajjanar Press Meet on SIM Swap Fraud | Oneindia Telugu
 10 మంది అందర్

10 మంది అందర్

అరుణ బసవరాజ్, అజిత్ కూండ కలోని, చౌహాన్ రోహిత్, పరాస్ అస్లాం, గణేష్ మహదేవ, అకాష్ కండోలి అనే నిందితులు నకిలీ పత్రాలు తయారు చేసి భారత సైన్యంలో చేరారని పోలీసు అధికారులు గుర్తించారు. ఈ ఆరు మందితో పాటు ముగ్గురు పోలీసులు, మరో వ్యక్తిని విజయనగర జిల్లాలోని హీరేహడగలి పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులలో కొందరు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Fraud: Ten arrested for appointment an Indian Army on duplicate documents in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X