Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్

తమిళగ వెట్ట్రి కజగం (TVK) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ నేడు శనివారం పుదుచ్చేరిలో తన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ సమావేశాన్ని నిర్వహించారు. పుదుచ్చేరిపై వరాల జల్లు కురిపించారు. అనేక వాగ్దానాలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర హోదా వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం లేకుండా పాలన సాగుతుందని స్పష్టం చేశారు.

తట్టన్‌చావడిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ మాట్లాడారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికల్లో విజిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీవీకే అధికారంలోకి వస్తే, ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తుందని తేల్చి చెప్పారు. విజయ్ తమ మేనిఫెస్టోలో పలు కీలక హామీలను ప్రకటించారు. తల్లులకు రూ. 25,000 ప్రసూతి సహాయాన్ని అందిస్తామని తెలిపారు.

Free Power for BPL Families Rs 25 Lakh Medical Insurance and Rs 25000 Maternity Aid Vijay Promises

ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం 100 శాతం పంటల బీమా, మత్స్యకారులకు లీటరు డీజిల్ పై రూ. 20 సబ్సిడీని ఇస్తామని వాగ్దానం చేశారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు రూ. 25 లక్షల వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెడతామని విజయ్ వివరించారు. బీపీఎల్ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను హామీగా ఇచ్చారు.

పుదుచ్చేరిలో ఆధునిక కళలు, సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, తద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు విజయ్. ప్రతిపక్ష కాంగ్రెస్-డీఎంకేది గందరగోళ కూటమిగా అభివర్ణించారు. అధికారంలో ఉన్న ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు. అవసరం కోసం ఏర్పడిన బంధంగా అభివర్ణించారు.

రేషన్ షాపుల పరిస్థితిని ప్రస్తావించారు విజయ్. బియ్యం మినహా అన్ని నిత్యావసర సరకుల సరఫరా ఎప్పుడో నిలిచిపోయిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బియ్యం తప్ప ఇంకేమీ లభించట్లేదని గుర్తు చేశారు. రేషన్ షాపులకు నెలవారీ అద్దె చెల్లించకపోవడంతో పాఠశాలల నుండి బియ్యం పంపిణీ జరుగుతోందని విజయ్ ఆరోపించారు. రేషన్ షాపుల ఉద్యోగులకు అయిదేళ్లుగా జీతాలు అందలేదని పేర్కొన్నారు.

మైనారిటీలతో సహా సమాజంలోని ప్రతి వర్గానికి భద్రత అవసరమని విజయ్ పునరుద్ఘాటించారు. మైనారిటీల ముసుగులో లేదా మైనారిటీలకు వ్యతిరేకంగా ఏర్పడిన రాజకీయ కూటములను నమ్మవద్దని సూచించారు. ప్రజల పక్షాన నిలబడే టీవీకే అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగే పోలింగ్ తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడుతుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+