చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రమండలానికి ఫ్రీ టూర్,ఇంటింటికీ రోబోలు,బోట్లు.. తమిళ ఎన్నికల్లో 'ఇండిపెండెంట్' హామీల మోత...

|
Google Oneindia TeluguNews

'ఆపరేషన్ దుర్యోధనా' అని అప్పట్లో తెలుగులో ఒక సినిమా వచ్చింది. అందులో హీరో శ్రీకాంత్... ఎన్నికల్లో తనను గెలిపిస్తే హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తానని వాగ్ధానం చేస్తాడు. ఎన్నికల్లో నేతలు ఇచ్చే హామీలు ఎంత అతిశయోక్తితో కూడుకుని ఉంటాయో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. ఇప్పుడిదే పరిస్థితి తమిళనాడులోనూ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించేస్తున్నారు. అంతా ఫ్రీ... అన్నీ ఫ్రీ అని జనాన్ని ఊదరగొడుతున్నారు. ఓ అభ్యర్థి ఇంకో అడుగు ముందుకేసి... ఎన్నికల్లో తనను గెలిపిస్తే కృత్రిమ సముద్రంతో పాటు మిమ్మల్ని చంద్రమండలానికి పంపిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఇవే కాదు... ఆయన ఇలాంటి హామీలు ఇంకా చాలానే ఇచ్చారు... ఇంతకీ ఎవరా అభ్యర్థి...

శరవణన్ రూటే సెపరేటు...

శరవణన్ రూటే సెపరేటు...

తమిళనాడులోని దక్షిణ మధురై నుంచి శరవణన్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సాధారణంగా అభ్యర్థులెవరైనా పలానా సమస్యను పరిష్కరిస్తామనో లేక పలానా పరిశ్రమ ఏర్పాటయ్యేలా చేస్తామనో.. అదీ కాదంటే... ఉచితంగా గృహోపకరణాలు పంపిణీ చేస్తామనో... ఇలా ఎన్నికల్లో రకరకాల హామీలు ఇస్తుంటారు. కానీ శరవణన్ రూటే సెపరేటు... ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు వింటే మతి పోవాల్సిందే. అసలు ఆ హామీల అమలు సాధ్యమేనా... వినేవాళ్లు ఉంటే ఏమైనా చెప్తారా... అనిపించకమానదు ఒక్కసారి ఆయన గారి మేనిఫెస్టోపై లుక్కేస్తే...

ఇవీ శరవణన్ ఇచ్చిన హామీలు...

ఇవీ శరవణన్ ఇచ్చిన హామీలు...

నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా చంద్రమండలం టూర్...

స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు...
ఇళ్లలో ఆడవాళ్లకు పనిలో సాయపడేందుకు ఇంటింటికీ ఓ రోబో పంపిణీ...
మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కాలువలు తవ్వించడమే కాకుండా.. ఇంటికో బోటు...
నియోజకవర్గ ప్రజలను ఎండవేడి నుంచి కాపాడేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండ నిర్మాణం...
ప్రజలు సేదతీరేందుకు కృత్రిమ సముద్రాన్ని సృష్టించి బీచ్ నిర్మాణం.
నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత ఐఫోన్...

ఉచిత హామీలతో ఫ్రీ పబ్లిసిటీ...

ఉచిత హామీలతో ఫ్రీ పబ్లిసిటీ...

ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ శరవణన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. డీఎంకె,అన్నాడీఎంకె లాంటి బలమైన పార్టీలను తట్టుకోవాలంటే బలమైన మేనిఫెస్టో అవసరం అనుకున్నాడో ఏమో గానీ... ఇలా జనాలకు దిమ్మతిరిగే హామీలు ఇస్తున్నాడు. ఈ హామీలు శరవణన్‌కు ఓట్లు రాలుస్తాయో లేదో తెలియదు గానీ కావాల్సినంత ప్రచారం మాత్రం తీసుకొస్తున్నాయి. చూడాలి మరి... ఎన్నికల్లో శరవణన్ అదృష్టం ఎలా ఉండబోతుందో...! అటు ప్రధాన పార్టీలు కూడా పోటాపోటీగా ఉచిత హామీలను గుప్పించేస్తున్నాయి. 18 నుంచి 23 ఏళ్ల వయసు గల అమ్మాయిలకు టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అన్నాడీఎంకె ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, మహిళలకు బస్సు ప్రయాణ ఛార్జీల్లో 50 శాతం రాయితీ, ఉచిత కేబుల్ టీవీ కనెక్షన్‌ హామీలిచ్చింది. డీఎంకె.. ప్రభుత్వ పాఠాశాలల విద్యార్థులకు ఉచిత డేటా,ఉచితంగా ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్స్ పంపిణీ, 30 ఏళ్ల లోపు విద్యార్దుల విద్యారుణాల మాఫీ, పాఠశాల విద్యార్ధులకు ప్రతిరోజూ ఉదయం ఉచిత పాలు పంపిణీ వంటి హామీలిచ్చింది.

English summary
Saravanan,an independent candidate from South Madhurai given unbelievable election promises.He promised his constituency people that he will arrange free trip to moon,free robots to each house,free ipads each one... this is the list of his manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X