ఆర్ టీసీలో ఉచిత ప్రయాణం, పవిత్ర పుణ్యక్రేతంలో లక్ష మంది భక్తులు, దెబ్బకు బస్సుల్లో !
బెంగళూరు/ధర్మస్థలం: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీ స్కీమ్ లు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఊహించని విధంగా బీజేపీకి చెక్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారెంటీ స్కీమ్ లో ఒకటైన మహిళలు ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చెయ్యడానికి సిద్దరామయ్య ప్రభుత్వం హామీ ఇచ్చింది.
సిద్ధరామయ్య ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్ ల్లో ఒకటైన మహిళ ఉచిత బస్సు ప్రయాణం అవకాశం ఇవ్వడంతో మహిళా ప్రయాణికులు జోరందుకున్నాయి, వీకెండ్ లో దక్షిణ కన్నడ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలంలో భారీ సంఖ్యలో జనసందోహం కనిపించింది. శ్రీక్షేత్రంగా ప్రసిద్ది చెందిన ధర్మస్థలానికి ఉత్తర కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. శ్రీ మంజునాథ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న భక్తులతో బస్టాప్ కిటకిటలాడింది. రద్దీ కారణంగా బస్సు దిగేందుకు, బస్సులు ఎక్కేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.

వీకెండ్ కావడంతో శనివారమే వచ్చి బస చేసిన భక్తులు ఆదివారం తిరిగి ప్రయాణం అవుతున్న భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో ధర్మస్థల బస్టాండ్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికుల రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర నిల్చుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఎదురుకాకుండా కొందరు ముందుగానే బస్సు కిటికీలోంచి సీటుపై లగేజీని పెట్టుకుని సీటు రిజర్వ్ చేసుకుంటున్న దృశ్యాలు దర్శనం ఇచ్చాయి. బస్సు ఎక్కేందుకు సీట్లు లేక ప్రయాణికులు బారులు తీరారు. .
బెంగళూరు, ఉత్తర కర్ణాటక, మైసూరు, హుబ్బళి, ధారవాడతో సహ పలు జిల్లాల నుంచి శ్రీ క్షేత్ర ధర్మస్థలానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సాధారణ వారాంతంలో శ్రీక్షేత్ర ధర్మస్థలానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు వస్తుంటారు, శనివారం ఒక్కరోజే యాభై వేల మందికి పైగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. శనివారం, ఆదివారం లక్ష మందికి పైగా ధర్మస్థం చేరుకుని శ్రీమంజునాథ స్వామిని దర్శించుకున్నారు.

భక్తుల రద్దీ పెరగడంతో ఆలయానికి ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరిగింది కన్నడ మీడియా తెలిపింది. అలాగే ఆలయంలోని రథవీధిలోని దుకాణంల్లో కూడా జనం రద్దీ కనిపించింది. జనం భారీ సంఖ్యలో వచ్చి దుకాణాల్లో బొమ్మలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడంతో వ్యాపారాలు బాగా జరగడంతో షాపు యజమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు
దక్షిణ కన్నడ జిల్లాలో అనేక ప్రసిద్ధ మతపరమైన దేవాలయాలు ఉన్నప్పటికీ భక్తులు ఎక్కువగా ధర్మస్థలం, కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలు ఎక్కువగా సందర్శిస్తున్నారు. ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్యస్వామి దేవాలయాలకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఈ రెండు ప్రాంతాలకు నేరుగా బస్సు సదుపాయం ఉంది.












Click it and Unblock the Notifications