కేసు పెట్టి రోహతక్ అక్కాచెల్లెళ్లు డబ్బు వసూలు: కొత్త బాధితుడు
రోహతక్: రోహతక్ అక్కాచెల్లెళ్ల పైన మరో వ్యక్తి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు తప్పుడు కథనాలు అల్లుతున్నారని అతను ఆరోపిస్తున్నాడు. తాను వారిని లైంగికంగా వేధించానంటూ ఆరు నెలల క్రితం తన పైన కేసు పెట్టారని వెల్లడించాడు.
తద్వారా తాను కాలేజి మానేశానని, కేసును ఉపసంహరించుకునేందుకు వారికి కొంత మొత్తం కూడా చెల్లించాల్సి వచ్చిందని వాపోయాడు. అతని తండ్రి కూడా దీనిపై స్పందించాడు. పరువు కాపాడుకునేందుకు వారి పీడ వదిలించుకునేందుకు రూ.20,000 చెల్లించామని చెప్పాడు.

కాగా, రోహతక్ అక్కాచెల్లెళ్ల ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బస్సులో నలుగురు ఆకతాయిలను కొట్టడం ద్వారా హర్యానాలోని రోహతక్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల పేర్లు జాతీయస్థాయిలో మార్మోగింది. అంతకుముందు పార్కులో ఓ యువకుడిని వారు చితకబాదారు.
అయితే, వారు తాము వేలమందిని ఇలాగే కొట్టామని చెప్పడంతో, పలు సందేహాలు తలెత్తాయి. విచారించగా.. ఆ అమ్మాయిల వ్యవహారశైలిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వేధిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసి, అబ్బాయిలను కొట్టి, డబ్బులు వసూలు చేసేవారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, తమకు లైఫ్ త్రెట్ ఉందని రోహతక్ అక్కాచెల్లెళ్లు మూడు రోజుల క్రితం చెప్పారు.












Click it and Unblock the Notifications