హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rain Alert: ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో 5 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాబోయే ఐదు రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రాష్ట్రాల్లో చిరు జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం అంచనా వేసింది.

ఏపీ, తెలంగాణలో తీవ్ర వర్షపాతం

ఏపీ, తెలంగాణలో తీవ్ర వర్షపాతం

తాజా వాతావరణ నవీకరణ ప్రకారం.. జూలై 10, 11 తేదీల్లో తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రమైన వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది.
అలాగే, జూలై 12 నుంచి గుజరాత్, గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్తా కర్ణాటకలో తాజాగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ముంబైకి మరికొన్ని రోజులు హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఔరంగ నది పొంగిపొర్లుతూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇప్పటి వరకు దాదాపు 300 మందిని స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కోస్తాంధ్ర, తెలంగాణలో ఐదురోజులపాటు విస్తారంగా వర్షాలు

కోస్తాంధ్ర, తెలంగాణలో ఐదురోజులపాటు విస్తారంగా వర్షాలు

రానున్న 4-5 రోజుల్లో ఛత్తీస్‌గఢ్, విదర్భ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం తెలిపింది. ఉత్తర ప్రాంతంలో, రాబోయే 5 రోజుల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. 10, 13, 14 తేదీల్లో పంజాబ్‌లో, 13, 14వ తేదీల్లో హర్యానా-చండీగఢ్; 10వ తేదీన పశ్చిమ రాజస్థాన్, 11-14 జూలై, 2022లో తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కర్ణాటకలో భారీ వర్షాలు, జలదిగ్బంధంలనే ప్రాంతాలు

కర్ణాటకలో భారీ వర్షాలు, జలదిగ్బంధంలనే ప్రాంతాలు

అలాగే, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో జూలై 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. వరదల కారణంగా వందలాది మందిని స్డాఫర్ ప్రాంతాలకు తరలించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో జలదిగ్బంధం నెలకొంది. భారీ వర్షాల కారణంగా మదగ్ మసూర్ సరస్సు పూర్తిగా నీటితో నిండిపోయింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్, కోస్టల్ కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

English summary
fresh spell of intense rainfall in several states including AP and Telangana during next five days: IMD predicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X