Friend house: ఫ్రెండ్ ఇంట్లో భార్య గొంతు కోసి చంపిన భర్త, రాత్రి ఏంజరిగింది ? వారం నుంచి !
బెంగళూరు: స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న శుభాకార్యానికి హాజరుకావడానికి దంపతులు వాళ్ల ఇంటికి వెళ్లారు. మూడు రోజుల పాటు స్నేహితుడి ఇంట్లో భార్యతో కలిసి భర్త సంతోషంగానే ఉన్నాడు. రాత్రి ఏం జరిగిందో ? ఏమో ? భార్యను చూసి భర్త రగిలిపోయాడు. స్నేహితుడి ఇంట్లోని రూమ్ లోనే పంచాయితీ పెద్దది అయ్యింది. అంతే భార్య గొంతుకోసి చంపేసిన భర్త అర్దరాత్రి అంబులెన్స్ లో ఆమె శవాన్ని తీసుకుని ఆమె సొంతఊరికి వెళ్లిపోయాడు. మీ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని నాటకమాడి పరారైనారు. భార్య కుటుంబ సభ్యులు శవాన్ని మళ్లీ అదే అంబులెన్స్ లో ఆ సంఘటన జరిగిన ఊరికి తీసుకుని వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది.
Romance:
పొలిటికల్
లీడర్,
ఆశా
ఆంటీ
రాసలీలలు,
ఆసుపత్రిలో,
పైన
సీసీ
కెమెరాలు
!

గ్రాండ్ గా పెళ్లి
కర్ణాటకలోని కోలారు జిల్లాలోని వేమ్ గల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ అనే యువకుడు కోలారుకు చెందిన శాంతా అనే యువతిని మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ప్రవీణ్ కుమార్, శాంతా ఇష్టపడటంతో రెండు కుటుంబాలు గ్రాండ్ గా పెళ్లి చేశారు. ప్రవీణ్ కుమార్, శాంతా దంపతులు చాలా సంతోషంగానే కాపురం చేస్తున్నారు.

స్నేహితుడి ఇంటికి దంపతులు
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు (బెంగళూరు గ్రామీణ జిల్లా సరిహద్దు)లోని కార్పోరేషన్ సమీపంలోని లైమ్ స్ట్రీట్ లో ప్రవీణ్ కుమార్ క్లోజ్ ఫ్రెండ్ వెంకట్ (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ కుమార్, వెంకట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎవరి ఇంట్లో శుభాకార్యం జరిగినా మరో కుటుంబం ఆ ఇంటికి వెలుతోంది. వారం రోజుల క్రితం ప్రవీణ్ కుమార్, శాంతా దంపతులు హోసూరులోని వెంకట్ ఇంటికి వెళ్లారు.

అంతా ఓకే.... కాని ?
మూడు రోజు క్రితం శుభకార్యంలో భార్య శాంతాతో సంతోషంగా గడిపిన ప్రవీణ్ కుమార్ బుధవారం రాత్రి ఏదో తేడా జరుగుతోందని అనుమానం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి స్నేహితుడు వెంకట్ ఇంట్లోని ఓ గదిలో ప్రవీణ కుమార్, శాంతా దంపతులు గొడవపడ్డారు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది.

భార్య గొంతుకోసి చంపేశాడు
రాత్రి గదిలో శాంతా గొంతుకోసి చంపేసిన ప్రవీణ్ కుమార్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. తన భార్య శాంతాకు అనారోగ్యంగా ఉందని ప్రవీణ్ కుమార్ అతని ఫ్రెండ్ వెంకట్ కుటుంబ సభ్యులను నమ్మించి వెంటనే అక్కడికి అంబులెన్స్ పిలిపించాడు. తాను బెంగళూరు వెళ్లి తన భార్యకు చికిత్స చేయిస్తానని ప్రవీణ్ కుమార్ వారిని నమ్మించి భార్య శాంతా శవాన్ని అంబులెన్స్ తీసుకుని హోసూరు నుంచి బయటకు వచ్చేశాడు.

ఆత్మహత్య చేసుకుందని డ్రామాలు
ప్రవీణ్ కుమార్ బెంగళూరుకు వెళ్లకుండా కోలారులోని శాంతా ఇంటి దగ్గరకు అంబులెన్స్ తీసుకెళ్లాడు. మీ కుమార్తె నాతో గొడవపడిందని, తాను బయటకు వెళ్లిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుంచి పరారైనాడు. శాంతా గొంతు కింద గాయాలు కావడం, గొంతు తెగిపోయి ఉండటంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చి అదే అంబులెన్స్ లో శాంతా శవాన్ని హోసూరు తీసుకెళ్లి పోలీసు కేసు పెట్టారు.
Recommended Video

ఫ్రెండ్ ఇంట్లో ఏం జరిగింది ?
హోసూరు పోలీసులు ప్రవీణ్ కుమార్ ఫ్రెండ్ వెంకట్ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. పోస్టుమార్టుంలో శాంతా హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది. పోలీసులు గాలించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఫ్రెండ్ ఇంట్లో ప్రవీణ్ కుమార్ అతని భార్య శాంతాను హత్య చెయ్యడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శాంతా హత్యకు కచ్చితమైన కారణాలు తెలీదని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, ప్రవీణ్ కుమార్ కు ట్రీట్ మెంట్ ఇస్తున్నామని హోసూరు పోలీసులు అంటున్నారు.