Friends: భార్యను వదిలేసిన భర్తను 40 సార్లు పొడిచి చంపేశారు. లిక్కర్ పార్టీతో !

చెన్నై/ చెంగల్పట్టు: భర్త తాగుబోతు కాదు, వీర తాగుబోతు. భర్తతో చాలాకాలం కాపురం చేసిన భార్య అతన్ని మద్యం మాన్పించే పునారావాస కేంద్రంలో చేర్పించింది. పునారవాస కేంద్రం నుంచి బయటకు వచ్చిన భర్త ఇంకా ఎక్కువ మద్యం సేవించాడు. భార్య అతని భార్యను వదిలేసి వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటున్న భర్తను కత్తితో 40 సార్లు పొడిచి హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 భార్యతో గొడవలు

భార్యతో గొడవలు

తమిళనాడులోని చెంగల్పట్టు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిపాక్కం మెట్టు వీధికి చెందిన అరుణ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి ఇష్టమైతే చిన్నచిన్న పనులు చేసుకుంటున్న అరుణ్ జీవనం సాగిస్తున్నాడు. అరుణ్ అతని భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మద్యానికి బానిసైన అరుణ్ కోలుకోవాలని అతన్ని పునరావాస కేంద్రంలో చేర్పించారు. పునరావాస కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అరుణ్ మద్యానికి బానిసయ్యాడు.

 మద్యం మత్తులో వాగేశారు

మద్యం మత్తులో వాగేశారు

అరుణ్ టార్చర్ భరించలేని అతని భార్య అతనికి దూరం అయ్యి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య విడిపోయినప్పటి నుంచి అరుణ్ అతనిస్నేహితులు, తెలిసిన వారితో ఊరి బయటకు వెళ్లి అర్ధరాత్రి వరకు మద్యం మత్తులో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి అరుణ్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అరుణ్ మద్యం మత్తులో ఎక్కడికో వెళ్లి ఉండొచ్చని వారి బంధువులు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. పులిపాక్కం మెట్టువీధి ప్రాంతానికి చెందిన పశుపతి, ధనశేఖర్ ఇద్దరూ కుడువాంచేరి సమీపంలో అనుమానాస్పదంగా మద్యం సేవించి ఏదో హత్య గురించి మాట్లాడుకుంటున్న విషయం స్థానికులు విన్నారు.

 ఫ్రెండ్ ను 40 సార్లు పొడిచేశారు

ఫ్రెండ్ ను 40 సార్లు పొడిచేశారు

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో పులిపాక్కం హైవే టౌన్‌లో అరుణ్, పశుపతి, ధనశేఖర్ కలిసి మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న అరుణ్‌, ధనశేఖరన్, పశుపతిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన పశుపతి, ధనశేఖర్‌లు రెండు కత్తులతో అరుణ్‌ కళ్లు, చెవులు, ముఖం తదితర భాగాలపై 40 సార్లు పొడిచారు.

 భయంతో వెళ్లి మద్యం సేవించారు

భయంతో వెళ్లి మద్యం సేవించారు

అనంతరం అరుణ్ ను కాలువలోకి తోసి అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అరుణ్ కాలువలో నుంచి బయటకు రాలేక అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు అన్నారు. పోలీసులు అరుణ్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. అరుణ్ చనిపోయాడని శనివారం నిర్ధారించుకున్నారు. అరుణ్ కాలువో అక్కడే శవమై పడి ఉండడం చూసి భయంతో వెళ్లిన పశుపతి, ధనశేఖర్ మద్యం సేవించి నోరుజారి చిక్కిపోయారని పోలీసులు అన్నారు. భార్యకు దూరం అయ్యి ఒంటరిగా ఉంటున్న అరుణ్ ను కత్తులతో 40 సార్లు పొడిచి హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+