Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఈసీ చివరి రివ్యూ: అంతా ఓకే

Lok Sabha elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఇంకో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

Fully committed to conducting elections in Jammu Kashmir says CEC Rajiv Kumar

లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా- బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

గడువు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తోన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల అధినేతలనూ కలుసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకులతో భేటీ అయ్యారు.

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలంటూ ఆయా పార్టీల నాయకులు రాజీవ్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కోరాయి. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. పక్షపాతరహితంగా పోలింగ్ ప్రక్రియ సాగుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పేర్కొన్నారు.

Fully committed to conducting elections in Jammu Kashmir says CEC Rajiv Kumar

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లో పోలింగ్ శాతం పెరిగేలా విస్తృత ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడి.. అక్కడ ఓటు హక్కు లేని వారికి జమ్మూ కాశ్మీర్‌లో ఓటు వేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇక్క డ మొత్తం అయిదు లోక్‌సభ, 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు.

అన్ని రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోనూ లోక్‌సభ ఎన్నికలను నిర్వహిస్తామని, ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీకీ పోలింగ్ జరిగేలా చూస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రాజీవ్ కుమార్. ఎన్నికల నిర్వహణపై ఇదే చివరి సమావేశమని ఆయన తేల్చి చెప్పారు. షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+