Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

G-20: ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం, మోడీని హత్తుకున్న అధ్యక్షుడు అసోమాని

న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ అధ్యక్షతన జీ20 విస్తరణ జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రతిపాదనకు సభ్యులందరి ఆమోదం లభించింది. దీంతో జీ20లో ఆఫ్రికన్ యూనియన్ సభ్యునిగా చేరింది.

జీ20 సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రియన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రకటించారు. దీంతో సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంతరం ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.

ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని యూనియన్ ఆఫ్ కొమొరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ (AU) చైర్‌పర్సన్ అజలీ అసోమాని ఆనందంతో వచ్చి కౌగిలించుకున్నారు. ఈ పరిణామంతో సమావేశంలో హర్షధ్వానాలు మారుమోగాయి.

G20 summit in India: African Union Joins G20, All Member Countries Accept PM Modis Proposal

అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. మొదటగా మొరాకో భూకంప మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలవాలన్నారు. వారికి అవసరమైన సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.


జీ20 అధ్యక్ష హోదాలో భారత్ సభ్యులందరికీ స్వాగతం పలుకుతోందన్నారు ప్రధాని మోడీ. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయమని అన్నారు. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయన్నారు. అందుకే మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ సూచించారు.


కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు ప్రధాని మోడీ. కోవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించాలన్నారు. మనం అందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుతామని చెప్పారు. ఈ క్రమంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య బేధాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారిందని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలోని 70కిపైగా నగరాల్లో 200కుపైగా జీ20 సదస్సులు జరిగాయని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+