బెయిల్ స్కాంలో గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్, ఐనా జైల్లో..
హైదరాబాద్: కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ కుంభకోణంలో హైదరాబాద్ హైకోర్టు గురువారం నాడు బెయిలు మంజూరు చేసింది. అయినప్పటికీ ఆయన జైల్లోనే ఉండనున్నారు. సుప్రీం కోర్టులో ఓఎంసీ మైనింగ్ కేసు విచారణ పెండింగ్‌లో ఉంది.
ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ ఆయన బయటకు రాలేని పరిస్థితి ఉంది. గతంలో పలు కేసుల్లో ఆయనకు బెయిలు మంజూరైనప్పటికీ ఆయన బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టలేకపోయారు. కీలకమైన ఓఎంసీ మైనింగ్ కేసు విచారణ కొనసాగుతోంది.

ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి బయటకు వచ్చేందుకు అప్పుడు ప్రయత్నించారు. అందులో భాగంగా తన బెయిల్ కోసం డబ్బులు ముట్టచెప్పారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరయింది.
కాగా, గాలి జనార్దన్ రెడ్డికి నాలుగు నెలల క్రితం కూడా ఓ కేసులో బెయిల్ వచ్చింది. ఆయనకు బెంగళూర్ సిబిఐ కోర్టు నాడు బెయిల్ మంజూరు చేసింది. ఏఎంసీ కేసులో బెయిల్ వచ్చింది. ఎఎంసి కేసులో బెయిల్ లభించినా ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) కేసులో ఆయన నిందితుడు. ఓఎంసి కేసులో బెయిల్ రానందున గాలి జనార్దన్ రెడ్డి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి 2012 సెప్టెంబర్ 18 నుంచి జైలులో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరు జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications