కూతురు పెళ్లి ఖర్చులు: ఐటి లెక్కలు చెప్పిన గాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అత్యంత వైభవంగా సామాన్యులు ముక్కున వేలేసుకునే విధంగా కూతురి పెళ్లి చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దృష్టిలో పడిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పెళ్లి ఖర్చుల వివరాలను ఐటి శాఖ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అక్రమ గనుల కేసులో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి తన కూతురు వివాహాన్ని అత్యంత వైభవంగా చేసిన విషయం తెలిసిందే. దాంతో పెళ్లి ఖర్చులపై ఐటి శాఖ అధికారులు ఆరా తీశారు. గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. దాంతో ఐటీ శాఖకు ఆయన లెక్కలు సమర్పించారు.

Gali Janardhan Reddy gives details of expenditure to IT officials

తాము అడిగిన 15 ప్రశ్నలకు గాలి జనార్దన్‌రెడ్డి సమగ్ర వివరాలు అందజేశారని ఐటీ అధికారులు తెలిపారు. పెళ్ళి మండపం, అలంకరణ, భోజన ఏర్పాట్లు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకారులు, అర్చకులకు చెల్లించిన సొమ్ము తదితర వివరాలను అధికారులు కూలంకుషంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, తమ వద్ద ఉన్న వివరాలకు గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన వివరాలకు కొన్ని చోట్ల పొంతన కుదరడం లేదని ఐటి శాఖ అధికారులు అంటున్నారు. దీంతో అవసరమైతే మరోసారి జనార్దనరెడ్డిని ప్రశ్నిస్తామని ఐటీ వర్గాలు తెలిపాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka ex minister Gali Jnardhan Reddy has replied to the 15 questions posed by IT department on his daughter Brahmani's wedding expenditure.
Please Wait while comments are loading...