ఆయన సీఎం కాకముందే మాకు సీక్రేట్ డీల్ కుదిరింది, గాలి జనార్దన్ రెడ్డి బాంబు !

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోవడంతో పాటు రాజకీయ నేతల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య నాతో బేరసారాలు సాగించారని కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి బాంబు పేల్చారు. సిద్దరామయ్య సీఎం కాకముందే మా మద్య డీల్ కుదిరిందని గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి గంగావతిలో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామన్ ఫ్రెండ్ ద్వారా బేరసారాలు సాగించారన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే, సిద్ధరామయ్య సీఎం కాకముందే మా ఇద్దరి మద్య డీల్ కుదిరిపోయిందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను స్థాపించిన కేఆర్పీపీ పార్టీ పది ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన మద్దతు అడిగారని గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gali Janardhan Reddy said that he had a secret deal with Siddaramaiah

ఇక్బాల్ అన్సారీకి ఏది తలో, ఏది తోకో తెలీదని గాలి జనార్దన్ రెడ్డి వ్యంగంగా అన్నారు. హెచ్‌ఆర్. శ్రీనాథ్, మల్లికార్జున నాగప్ప తనకు బుక్కైపోయారని మొదట అందరూ అనుకున్నారని, అయితే తనకు బుక్కైయ్యింది సిద్ధరామయ్య అని గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగావతి, బళ్లారి అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య ప్రచారం చెయ్యడానికి ఒక్కసారికూడా రాలేదని, ఆ విషయం గమనిస్తే మాధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయని అర్థం అవుతోందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే సిద్దరామయ్య, తాను గతాన్ని మరిచిపోయేలా కామన్ ఫ్రెండ్ ద్వారా డీల్ కుదుర్చుకున్నానని గాలి జనార్దన్ రెడ్డి బాంబు పేల్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాతో ఒప్పందం చేసుకుని గంగావతి, బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి రాలేదని, ఇటీవల గంగావతిలో మాట్లాడిన సిద్దరామయ్య గౌరవనీయులైన జనార్దన్ రెడ్డి గారు అని బహిరంగంగా మాట్లాడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, సిద్ధరామయ్య చాలా సంస్కారవంతుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కొనియాడారు.

ఇక్బాల్ అన్సారీకి ఎవరు అన్నా గౌరవం లేదు, అతనికి పిచ్చి పట్టిందని, ఓ సదస్సులో ఇక్బాల్ నా గురించి మాట్లాడేందుకు వెళ్లి తన పార్టీ సభ్యులతో గొడవకు దిగాడని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. హెచ్.ఆర్.శ్రీనాథ్ చేసిన పనులకు ముఖ్యమంత్రికే మింగుడు పడలేదని, హెచ్.ఆర్. శ్రీనాథ్ అంత బలవంతుడని తనకు ఎప్పుడూ తెలియదని, ఎవరు అడ్డుపడినా హెచ్.ఆర్. శ్రీనాథ్ మాత్రం అతని నోటికి బ్రేకులు వెయ్యలేదని, ఆ సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేచి నిలబడి పరువు కాపాడండి అని స్వయంగా అన్నారని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇక్బాల్ అన్సారీకి సంస్కారం లేదని, అతను ఓ పిచ్చోడు అని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+