
గాంధీ జయంతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీతో పాటు బాపూజీకి ప్రముఖుల నివాళి
జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణా శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. కాసేపు మౌనం పాటించి జాతిపిత త్యాగాలను పలువురు ప్రముఖులు స్మరించుకున్నారు.
ఏపీ
స్కూల్స్
లో
కరోనా
తిష్ట
;
కేసులు
అధికంగా
ఉన్న
జిల్లాలోనే;
నవోదయ
స్కూల్
లో
21
మందికి
పాజిటివ్
బాపూజీకి భారత రాష్ట్రపతి నివాళి
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన రామ్ నాథ్ కోవింద్ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన జాతిపిత గొప్పతనాన్ని స్మరించుకున్నారు. గాంధీ జయంతి రోజున బాపూజీకి నివాళి. భారతీయులందరూ గాంధీజీ పోరాటాలు మరియు త్యాగాన్ని స్మరించుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది . గాంధీజీ బోధనలు, ఆదర్శాలు మరియు విలువలకు కట్టుబడి ఉంటూ భారతదేశాన్ని గాంధీజీ కలలు గన్న దేశంగా మార్చడానికి మేము నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అని రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ సందేశం ఇచ్చారు.
బాపూజీ అహింసా సూత్రం మాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది: వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. మహాత్మా గాంధీ సత్యం మరియు అహింస విలువల ఆధారంగా భారతదేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేసే పోరాటానికి నాయకత్వం వహించారు. శాంతి, సామరస్యం మరియు విశ్వవ్యాప్త సోదరత్వం కోసం మా భాగస్వామ్య అన్వేషణలో ఆయన అహింసా సూత్రం మాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది అంటూ జాతిపిత మార్గనిర్దేశంలో ముందుకు సాగుతామని ట్వీట్ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు .
బాపూజీ జీవితం, ఆదర్శ మార్గం ఆచరణీయం : ప్రధాని మోడీ
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా నివాళులర్పించి ఆయనను స్మరించుకున్నారు. గాంధీ జయంతి నాడు తాను బాపూజీకి నమస్కరిస్తున్నానని, ఆయన గొప్ప సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంతరించుకున్నాయని, లక్షలాది మందికి బలాన్ని ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆయన జీవితము, ఆయన నడిచిన ఆదర్శ మార్గం సమాజంలోని ప్రతి ఒక్కరికి మార్గం చూపిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
శాంతి, అహింసా మార్గాల్లో నడవటానికి ప్రపంచానికే బాపూజీ ప్రేరణ : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి నాడు మహాత్మాగాంధీని స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ శాంతి మరియు అహింస మార్గంలో నడిచేందుకు ప్రపంచం మొత్తాన్ని ప్రేరేపించారని అమిత్ షా పేర్కొన్నారు. గాంధీజీ స్వదేశీ, స్వభాష మరియు స్వరాజ్య ఆలోచనలు దేశప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
అద్భుతమైన సంకల్పం..అపారమైన జ్ఞానం కలిగిన గొప్ప వ్యక్తిత్వం బాపూజీది
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మహాత్మా గాంధీ జయంతి రోజున జాతిపితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ లో గాంధీ జయంతి నాడు తాను పూజ్య బాపూజీకి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. అద్భుతమైన సంకల్పం మరియు అపారమైన జ్ఞానం కలిగిన గొప్ప వ్యక్తిత్వం బాపూజీది అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. మనం ఆయన జయంతి నాడు స్వచ్ఛత మరియు ఆత్మనిర్భర్ "గా భారతదేశానికి మనల్ని అంకితం చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు.

దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు .. జాతిపితకు ఘనంగా నివాళులు
వీరు
మాత్రమే
కాకుండా
దేశం
మొత్తం
అన్ని
రాష్ట్రాలకు
చెందిన
ముఖ్య
మంత్రులు
అధికార
పార్టీ
నాయకులు,
ప్రతిపక్ష
పార్టీల
నాయకులు,
పలువురు
ప్రముఖులు,
దేశ
ప్రజలు
ఈ
రోజు
మహాత్మా
గాంధీ
జయంతి
సందర్భంగా
గాంధీని
గుర్తు
చేసుకుంటున్నారు.
అహింస,
సత్యాగ్రహాలను
ఆయుధంగా
భారతదేశానికి
స్వాతంత్ర్యం
తీసుకొచ్చిన
మహాత్ముడి
ఘనతను
కొనియాడుతున్నారు.
ఆయన
చూపిన
మార్గం
ఆచరణీయమని,
ఆయన
మార్గంలో
నడవాలన్న
సంకల్పాన్ని
వ్యక్తం
చేస్తున్నారు.