గాంధీ హిందువు, గాడ్సే హిందుత్వాది: కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

జైపూర్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఆదివారం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. హిందూ, హిందుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందుత్వ వాదిని కాదని అన్నారు. భారత్ హిందువుల దేశమని, హిందుత్వవాదులది కాదని వ్యాఖ్యానించారు. గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాది అని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపులో చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

Gandhi was a Hindu, Godse a Hindutvavadi: Rahul Gandhi in Jaipur rally.

ఏడేళ్ల కాలంలో దేశాన్ని నాశనం చేశారని రాహుల్ ఆరోపించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు అల్లాడుతున్నా.. అధికారం కోసం పాకులాడేవారే హిందుత్వ వాదులంటూ బీజేపీ నేత నేతలనుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. మోడీ, ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ సాధించినదాన్ని బీజేపీ ప్రభుత్వం తన స్నేహితులకు దోచిపెట్టిందని ప్రియాంక వాద్రా ఆరోపించారు.

Recommended Video

    Virat Kohli Gains Seniors Support | Ganguly, Jay Shah పై వ్యతిరేకత | Oneindia Telugu

    ఎన్నికలు వచ్చేసరికి వారికి కులమో, మతమో, చైనానో ఇంకో దేశమో గుర్తు వస్తుందని ప్రియాంక వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలు మాత్రం గుర్తుకు రావని ఆరోపించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని తమను ప్రశ్నిస్తున్నారని.. ఆ సంగతి పక్కన పెట్టండి.. మీరు ఈ ఏడేళ్లలో ఏంచేశారో అది చెప్పాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ రైతులకు ఎరువులు ఇవ్వడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాగా, సమావేశానికి ముందు భారత సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా మరో 11 మంది ఆర్మీ అధికారుల మరణించిన నేపథ్యంలో వారికి సంతాపంగా మౌనం పాటించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+