గణేష్ నిమజ్జనం: తుంగభద్రా నదిలో 10 మంది గల్లంతు
శివమొగ్గ/బెంగళూరు: గణేష్ నిమజ్జనం చేస్తున్న సమయంలో తెప్ప మునిగి 10 మంది యువకులు గల్లంతు అయిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో జరిగింది. ఐదు మంది ప్రాణాలతో బయటపడ్డారు.
శివమొగ్గ సమీపంలోని హాడుహళ్ళిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. బుధవారం మద్యాహ్నం వినాయకుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్లి నిమజ్జనం చెయ్యడానికి ప్రయత్నించారు.

15 మంది యువకులు హాడుహళ్ళి సమీపంలోని తుంగభద్రా నదిలో తెప్ప మీద వినాయకుడి విగ్రహాన్ని తీసుకు వెళ్లారు. నది మధ్యలో వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేస్తున్న సమయంలో తెప్ప మునిగిపోయింది.
10 మంది యువకులు గల్లంతు అయ్యారు. ఐదు మంది ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గల్లంతు అయిన యువకుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications