లేడీ నిర్మాతకు చుక్కలు చూపించిన డ్రైవర్, మేనేజర్, కిడ్నాప్ డ్రామాతో కోట్లకు !
ఉద్యోగం ఇచ్చిన సినీ నిర్మాత, టీవీ సీరియల్ లేడీ నిర్మాత నుంచి కోటి రూపాయలు వసూలు చేసేందుకు కిడ్నాప్ డ్రామా ఆడిన ఆమె కారు డ్రైవర్‌తో సహా ఏడుగురిని బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళకు చెందిన శ్రీనివాస్, కురుబరహళ్లికి చెందిన హేమంత్‌కుమార్, హెగ్గనహళ్లికి చెందిన తేజస్, మోహన్, కిరణ్, మైసూర్‌కు చెందిన కులదీప్ సింగ్‌లను అరెస్టు చేశారు.

కిడ్నాప్ డ్రామా రసవత్తరంగా నడిపిన నిందితుల నుంచి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కన్నడ టీవీ సీరియల్ మహిళా నిర్మాత ఎస్. లక్ష్మి దగ్గర పని చేస్తున్న నగేష్, హేమంత్ ఇటీవల అపహరణ డ్రామాకు తెరలేపి ఇప్పుడు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. శ్రీనిది ప్రొడక్షన్ హౌస్ అనే బ్యానర్ మీద లక్ష్మీ అనే మహిళ కన్నడ సినిమాలు, టీవీ సీరియల్ నిర్మిస్తున్నారు.
సినీ సంస్థ యజమాని అయిన లక్ష్మి తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌లో నివసిస్తుంది.
ప్రస్తుతం లక్ష్మీ నిర్మించిన ఓ సీరియల్ ఓ ప్రైవేట్ కన్నడ ఛానెల్‌లో ప్రసారం అవుతోంది. ఈ కంపెనీలో నగేష్ మేనేజర్‌గా, హేమంత్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మహిళ అయినా కన్నడ సినీ రంగంలో, టీవీ సీరియల్స్ నిర్మించడంలో
లక్ష్మి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవల బ్యాంకులో కోటి రూపాయల హోమ్ లోన్ తీసుకున్న లక్ష్మీ ఆ డబ్బు ఇంటికి తీసుకు వచ్చారని తెలిసింది. యజమాని లక్ష్మీ దగ్గర ఉన్న డబ్బును లూటీ చెయ్యడానికి తన స్నేహితులతో కలిసి కిడ్నాప్‌కు పథకం పన్నిన కారు డ్రైవర్ హేమంత్ అతని స్నేహితులకు మ్యాటర్ చెప్పాడు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం వ్యక్తిగత పని ఉందని చెప్పి లక్ష్మి కారును తీసుకెళ్లేందుకు కారు డ్రైవర్ హేమంత్, కంపెనీ మేనేజర్ నాగేష్ ఆమె ఇంటికి వెళ్లారు.
అదే రోజు రాత్రి లక్ష్మికి ఫోన్ చేసిన నిందితుడు నాగేష్ తరువాత అతని మొబైల్ ఫోన్ మరుసటి రోజు స్విచాఫ్ అయింది. హేమంత్ తన వెంట నగేష్‌ని తీసుకెళ్లాడు. అయితే కిడ్నాప్ కథ నాగేష్ కు తెలియదు.

నిందితులు ఫిబ్రవరి 14వ తేదీన లక్ష్మికి ఫోన్ చేసి ఏడుస్తూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేసి కారులో పలు ప్రాంతాల్లో తిప్పుతున్నారని చెప్పాడు.అప్పుడు ఒక కిడ్నాపర్ అతని మొబైల్ ఫోన్ తీసుకొని మీ దగ్గర పని చేసే వ్యక్తి ప్రాణాలతో కావాలంటే మీరు రూ1 కోటి చెల్లించాలని చెప్పారు.
కోటి రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి కాల్ కట్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన లక్ష్మి వెంటనే మహాలక్ష్మి లేఅవుట్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సినీ నిర్మాత లక్ష్మి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు, టోల్ గేట్ లలో ఆమె కారు తిరిగిన ప్రాంతాలు పరిశీలించారు. ఈ సమాచారం ఆధారంగా నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications